Begin typing your search above and press return to search.

వ‌ర్సిటీలో సీఎం జ‌గ‌న్ ఫోటో పెట్టేందుకు నో!

By:  Tupaki Desk   |   17 July 2019 9:47 AM GMT
వ‌ర్సిటీలో సీఎం జ‌గ‌న్ ఫోటో పెట్టేందుకు నో!
X
ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. కోట్లాది మంది ప్ర‌జ‌లు త‌మ ఓటు తీర్పుతో అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన‌ప్పుడు అన్ని వ్య‌వ‌స్థ‌లు ఆ నిర్ణ‌యానికి గౌర‌వ మ‌ర్యాద‌లు ఇవ్వాలి. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫోటోను పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తే.. కొంద‌రు అడ్డుకున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. త‌న ఛాంబ‌ర్ లో సీఎం ఫోటోను పెట్టాల‌ని హెల్త్ వ‌ర్సిటీ వీసీ స్వ‌యంగా కోరినా సంబంధిత అధికారులు ప‌ట్టించుకోని తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ వీసీ డాక్ట‌ర్ సీవీ రావు.. త‌న ఛాంబ‌ర్ లో సీఎం జ‌గ‌న్ ఫోటో పెట్టాల‌ని కోరారు. వీసీ నోటి నుంచి ఆదేశం వ‌చ్చి రోజులు గ‌డుస్తున్నా.. సిబ్బంది మాత్రం జ‌గ‌న్ ఫోటోను పెట్ట‌ని ప‌రిస్థితి నెల‌కొంది. వ‌ర్సిటీలోని కీల‌క పోస్టుల్లో ఉన్న కొంద‌రు ఉద్యోగులు జ‌గ‌న్ ఫోటో పెట్టే విష‌యంలో ఆల‌స్యం చేస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది.

వ‌ర్సిటీ ఉద్యోగ సిబ్బంది తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. సీఎం ఫోటో పెట్టే విష‌య‌మై ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌లేద‌న్న నెపాన్ని చూపిస్తూ ఫోటో పెట్ట‌కుండా సాకులు చెబుతున్న తీరు స‌రికాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఆసక్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ ప‌క్క‌నే ఉన్న సిద్ధార్థ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లోని ప్రిన్సిపాల్ ఛాంబ‌ర్ లో జ‌గ‌న్ ఫోటోను పెట్టి చాలా కాల‌మైంది. ఇదొక్క‌టే కాదు.. విజ‌య‌వాడ‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో సీఎం జ‌గ‌న్ ఫోటోను ఏర్పాటు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ వీసీ ఛాంబ‌ర్ లో పెట్ట‌క‌పోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. కొంద‌రు ఉద్యోగుల అత్యుత్సాహ‌మే దీనికి కార‌ణంగా చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాల‌తో అన‌వ‌స‌ర‌మైన ఉద్రిక్త‌లు చోటు చేసుకుంటాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.