Begin typing your search above and press return to search.

చంద్రబాబు కన్నీళ్లు, వైసీపీ అరాచకం పై నిప్పులు చెరిగిన ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   20 Nov 2021 11:32 AM GMT
చంద్రబాబు కన్నీళ్లు, వైసీపీ అరాచకం పై నిప్పులు చెరిగిన ఎన్టీఆర్
X
టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లకు నందమూరి ఫ్యామిలీ కరిగిపోయింది. ఈ మధ్యాహ్నం నందమూరి బాలకృష్ణ తన నందమూరి సోదరులు, సోదరీమణులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీని కడిగిపారేశాడు. వైసీపీని ఖబడ్దార్ అంటూ హెచ్చరించాడు. తాజాగా నందమూరి యువ హీరోలు రంగంలోకి దిగారు.

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తోపాటు నందమూరి కళ్యాణ్ రామ్, మరో హీరో నారా రోహిత్ కూడా వైసీపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో ఒక వీడియోను విడుదల చేసి చంద్రబాబు కన్నీళ్లు, ఆయన సతీమణి భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండించారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో విమర్శలు,ప్రతి విమర్శలు సర్వసాధారణం అని.. ప్రజా సమస్యలపై జరగాలే కానీ.. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని స్పష్టం చేశారు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఈ ఘటన నా మనసును కలిచివేసిందన్నారు. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో..ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుతుందన్నారు.

శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ఘటన తన మనసును కలిచివేసిందని ఎన్టీఆర్ చెప్పారు. సమస్యలన్నీ పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఎన్టీఆర్ విమర్శించారు. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడడం అరాచక పాలనకు నాందిగా పేర్కొన్నారు. అతి తప్పని స్పష్టం చేశారు.

స్త్రీని గౌరవించడం మన సంస్కృతి అని.. మన సంప్రదాయం అని చెప్పుకొచ్చారు. తాను వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాట్లాడడం లేదని.. ఒక కుమారుడిగా.. భర్తగా.. తండ్రిగా..భారతీయుడిగా మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు.

రాజకీయ నేతలు ఇలాంటివి ముగించాలని ఎన్టీఆర్ కోరారు. రాబోయే తరాలకు బంగారు బాట వేయాలని.. ఇలాంటివి ఇంతటితో ఆగిపోతాయని కోరుకుంటున్నట్టు జూ. ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ, రామకృష్ణతో సహా ఎన్టీఆర్ కుమార్తెలు సైతం ఈ అంశంపైన స్పందించారు. భువనేశ్వరిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రామకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మాట్లాడారు. ‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిదన్నారు. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారని.. అలాంటి గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి.. అది వ్యక్తిగతంగా మాట్లాడడం బాధకరమన్నారు.

ఇక హీరో నారా రోహిత్ సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు.అసెంబ్లీలో కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుధీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఇలా నందమూరి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబుకు బాసటగా నిలిచి వైసీపీపై నిప్పులు చెరిగారు.