Begin typing your search above and press return to search.
బాలయ్య అల్లుళ్ల మాటలు..ఎన్టీఆర్ కామ్!
By: Tupaki Desk | 26 Aug 2019 12:43 PM GMTలోకేష్ కు అడ్డు కాకూడదనే జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ ఇవ్వడం లేదనే అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి.ఆఖరికి లోకేష్ ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా పార్టీ భావినాయకుడు మాత్రం ఆయనే, చంద్రబాబు నాయుడి తనయుడే పార్టీకి దిక్కు అనే భావనను తెలుగుదేశం పార్టీలో కలిగిస్తూ ఉన్నారు. లోకేష్ టాలెంట్ ఏమిటో ఏపీ ప్రజలకు బాగానే తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా రకరకాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో యువనేతగా ఎంటర్ కావాలనే అభిప్రాయాలకు ఆస్కారం ఏర్పడింది. ఆ విషయంలో ముఖ్యనేతలు ఎవరూ మాట్లాడలేదు. అభిమానుల్లో మాత్రం అలాంటి అభిప్రాయాలున్నాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ బాలకృష్ణ చిన్నల్లుడు రచ్చ రేపారు.
తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని శ్రీభరత్ తేల్చి చెప్పాడు. ఇందులో మరో ఆలోచనే లేదన్నట్టుగా మాట్లాడాడు. తారక్ ను పార్టీ పిలవడం కాదు,తారక్ వచ్చి చంద్రబాబును కలవాలని..అప్పుడు ఆయన అవసరం ఏమిటో చంద్రబాబు డిసైడ్ చేస్తారన్నట్టుగా శ్రీభరత్ వ్యాఖ్యానించాడు. లోకేష్ కు తోడల్లుడు అయిన శ్రీభరత్ తన దాయాదికి సపోర్ట్ గానే ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని వ్యాఖ్యానించాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అయితే అవసరం అయినప్పుడు పార్టీకి మద్దతుగా తారక్ తో ప్రచారం కూడా చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరెవరో వచ్చి తారక్ అవసరం పార్టీకి లేదనేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ తరఫున మాట్లాడేవాళ్లు ఎవరూ లేకపోవడం గమనార్హం.
ఇక ఈ అంశం మీద జూనియర్ కూడా రియాక్ట్ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ తన పనిలో తాను ఉన్నాడు. గత కొన్నాళ్లుగా చంద్రబాబుతో జూనియర్ కు చాలా దూరం ఉందనే విషయం స్పష్టం అయ్యింది. కూకట్ పల్లిలో తన సోదరిని పోటీలో ఉంచినా తారక్ ప్రచారానికి వెళ్లలేదు. అలా తెలుగుదేశం పార్టీతో ఆయన డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ పరిణామాల్లో శ్రీభరత్ వ్యాఖ్యలు పార్టీతో తారక్ కు మరింత దూరాన్ని పెంచుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే తారక్ మాత్రం ఈ పరిణామాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆ హీరో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.