Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ తో బాబు : జూనియర్... జూనియర్...?
By: Tupaki Desk | 12 July 2022 3:30 PM GMTవచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావో రేవో లాంటివి. అలాంటి ఎన్నికల్లో పార్టీ గెలుపు కచ్చితంగా ఉండాలి. లేకపోతే ఇక తెలుగుదేశం పార్టీని చరిత్రలోనే చూడాలి. తెలుగుదేశం విషయానికి వస్తే అన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో విజయం కోసం చూస్తుంది అన్నది నిజం. ఈ విషయంలో రెండవ మాటకు ఆసకారమే లేదు. చంద్రబాబు ఏ ఒక్క దాన్ని లైట్ గా తీసుకోవడంలేదు. ప్రత్యేకించి ఆయన జగన్ ఎత్తుగడల మీద ఒక కన్నేసి ఉంచారు.
జగన్ని ఓడిస్తామని బయటకు చెబుతున్నా అంత సులువుగా విజయం తమ పరం కాదని కూడా ఆయన గుర్తించారు అని అంటున్నారు. అందుకే ఈసారి తమ తరఫున చేసే ప్రయత్నాలలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. ముందుగా చూసుకుంటే అన్న గారి కుటుంబాన్ని మొత్తం కలపాలని బాబు పరితపిస్తున్నారు. టీడీపీ జెండా ఏపీలో ఎత్తున ఎగరేయడం కోసం అవసరం అయితే ఎన్ని మెట్లు దిగడానికైనా తాను సిద్ధమని బాబు అంటున్నారుట.
టీడీపీలో తనకు చిరకాల ప్రత్యర్ధిగా ఉంటూ కుటుంబపరంగా పెద్దగా పట్టించుకోని పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబంతో మంచి సంబంధాలను ఆయన పునరుద్ధరించుకున్నారు. ఆ మధ్య నందమూరి వారి ఇంట జరిగిన ఒక వివాహ వేడుకలో దగ్గుబాటితో మాటలు కలిపి సాన్నిహిత్యం పెంచుకున్న బాబు లేటెస్ట్ గా ఆయన గుండెపోటు తో ఆసుపత్రిలో చేరితే వెళ్ళి పరామర్శించి వచ్చారు.
ఈ ఫోటో చూసిన వారు బాబు మారిపోయారు అనే అంటారు. ఇపుడు ఆయన చూపు జూనియర్ ఎన్టీయార్ మీద ఉంది అంటున్నారు. జూనియర్ ఎన్టీయార్ 2009 ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేశారు. ఆ తరువాత ఆయన ఎక్కడా కనిపించలేదు. 2014, 2019 ఎన్నికలు కూడా ఆయన ఊసు లేకుండానే జరిగిపోయాయి. కానీ ఇపుడు మాత్రం అలాంటి ఇలాంటి ఎన్నికలు కావు కాబట్టి జూనియర్ ని కూడా తమ వైపునకు రప్పించుకోవాలని బాబు చూస్తున్నారు.
అవసరం అయితే ఏ భేషజాలు లేకుండా అన్నీ విడిచి పెట్టి జూనియర్ ఇంటికి తానే స్వయంగా వెళ్ళి మేనల్లుడికి నచ్చచెప్పి ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని బాబు చూస్తున్నారని టాక్. ఇక జూనియర్ అయితే తనకు సినిమాలే తప్ప రాజకీయాలు అవసరం లేదని భీష్మించుకుని కూర్చున్నారు. కానీ టాలీవుడ్ ని ఒక బలమైన వర్గం శాసిస్తోంది. అదే సమయంలో ఆ వర్గం ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలని చాలా గట్టిగానే కోరుకుంటోంది.
ఆ వర్గానికి చెందిన వారంతా కూడా జూనియర్ ఎన్టీయార్ కి నచ్చచెబుతారు అని అంటున్నారు. ఒక విధంగా అతి పెద్ద వత్తిడి అయితే జూనియర్ మీద ఈసారి ఉండబోతోందిట. అలాగే టీడీపీ అనుకూల మీడియా నుంచి పెద్దలు కూడా ఈ విషయంలో రంగంలోకి దిగి జూనియర్ ని ఎలాగైనా టీడీపీకి ప్రచారం చేసేలా చూస్తారని అంటున్నారు. మొత్తానికి తమకంటూ ఒక పార్టీ ఉండాలని భావిస్తున్న వారు అంతా ఆ పార్టీ అంతరించిపోకూడదని గట్టి పట్టుదలతో తెర వెనక పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు అన్ని రకాల ఆభిజాత్యాలను పక్కన పెట్టి అందరినీ కలుస్తూ వస్తున్నారు అని అంటున్నారు. తొందరలోనే జూనియర్ తో ఎన్టీయార్ భేటీ కూడా జరిగే అవకాశం ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెబుతున్నారు. మొత్తానికి జూనియర్ అని కలవరిస్తున్న టీడీపీ క్యాడర్ కి కొత్త ఊపిరులు అద్దేలా యంగ్ టైగర్ వచ్చే ఎన్నికల వేళ సందడి చేసేలా అన్ని రకాలైన ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.