Begin typing your search above and press return to search.

బాబు వదిలేసినా.. జూ.ఎన్టీఆర్ వదల్లేదు..

By:  Tupaki Desk   |   28 May 2019 4:17 AM GMT
బాబు వదిలేసినా.. జూ.ఎన్టీఆర్ వదల్లేదు..
X
అన్న గారి జయంతి నేడు.. ఎంతో ఉత్సాహం.. టీడీపీ పండుగలా జరిగేది. మహానాడు పేరిట నాలుగైదు రోజులు ఘనంగా టీడీపీ నేతలు జరిపేవారు. ఎన్టీఆర్ నివసించిన గండిపేట ఫాంహౌస్ సిద్ధమయ్యేది. ఎన్టీఆర్ ఘాటు ముస్తాబయ్యేది. హైదరాబాద్ లో మహానాడును టీడీపీ నేతలంతా పండుగలా నిర్వహించేవారు.. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది..

టీడీపీ ఓటమితో అన్న గారి జయంతి కళతప్పింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయంతో ఈ దుస్థితి దాపురించింది. చంద్రబాబు ఘోర ఓటమి తర్వాత బయటకు రావడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితులున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా హతాషులయ్యారు. అందుకే అన్నగారి జయంతి వచ్చినా నిర్వహించడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా ఉత్సాహం చూపడం లేదు. దాదాపు మహానాడు వేడుక రద్దయినట్టే కనిపిస్తోంది.టీడీపీ ఓటమికి, ఎన్టీఆర్ జయంతికి ముడిపెట్టి టీడీపీ చేసిన ఈ నిర్లక్ష్యంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు.

చంద్రబాబు నిర్వహించకపోయినా నందమూరి ఫ్యామిలీ మాత్రం ఎన్టీఆర్ పై ప్రేమను చాటింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉదయం 5.30 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. జూనియర్ తో పాటు ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్, మరికొంత మంది అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులర్పించారు.

ఎన్టీఆర్ కొద్ది నిమిషాలు అక్కడే కూర్చుని తాతను తలుచుకున్నారు. మరికొంత మంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున రావడంతో ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక టీడీపీ ఘోరపరాజయం నేపథ్యంలో అభిమానులు ఎన్టీఆర్ ను టీడీపీలో రావాలని నినాదాలు చేశారు.