Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కి చిన్న కుమార్తె అంటే అమితప్రేమ!-తలసాని
By: Tupaki Desk | 2 Aug 2022 4:30 PM GMTనందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదంలో నింపిన సంగతి తెలిసిందే. సినీరాజకీయ రంగ ప్రముఖులు ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి పార్దీవదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ-``ఉమా మహేశ్వరి అంటే నందమూరి తారకరామారావు గారికి అధిక ప్రేమ. వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను`` అని అన్నారు.
కంఠమనేని ఉమా మహేశ్వరి మృతి అనంతరం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావోద్వేగ్వానికి లోనయ్యారు. ఆమె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చంద్రబాబు అన్నారు.
ఇటీవల కుటుంబ సభ్యులందరం కలుసుకుని ఆనందంగా గడిపామని.. ఇంతలోనే విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరమని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా శాంతంగా ఉండేవారని తెలిపారు.
చిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని నారా లోకేష్ విచారాన్ని వ్యక్తం చేసారు.
కుటుంబంలో ఏ శుభకార్యమైనా చిన్నమ్మ ఎంతో పెద్దమనసుతో దగ్గరుండి జరిపించేవారని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. మార్గదర్శిగా నిలిచిన చిన్నమ్మ మృతి తమ కుటుంబానికి కోలుకోలేని విషాదం అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.