Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్, వైఎస్సార్‌లకు 'భారత రత్న' ఇవ్వాలి: మంత్రి కొడాలి
By: Tupaki Desk | 29 Jan 2022 4:48 PM GMTగుడివాడ క్యాసినో వ్యవహారంతో ఇటీవల కాలంలో గంట గంటకు వార్తల్లోకి వచ్చిన.. ఫైర్ బ్రాండ్ నాయకుడు.. వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని.. తాజాగా సంచలన డిమాండ్ చేశారు. దివంగత కాంగ్రెస్ నాయకుడు, సీఎం వైఎస్సార్‌కు, తెలుగు వారి ఆరాధ్య దైవం.. ఆత్మగౌరవ నినాదానికి ప్రతీక అయిన.. అన్నగారు ఎన్టీఆర్‌కు.. భారత రత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా.. కృష్ణా జిల్లా గుడివాడను వేరు చేస్తూ.. ప్రభుత్వం కొత్తగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ఎన్టీఆర్ వారసులం అని చెప్పుకునే సిగ్గుమాలి న వ్యక్తులు చేయలేని పని ముఖ్యమంత్రి జగన్ చేసి చూపించారని తనదైన శైలిలో వ్యాఖ్యలు గుప్పించారు. పద్నాలుగేళ్లు అధికారంలో ఉండి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కనీసం ప్రపోజల్ కూడా పెట్టలేని వ్యక్తులు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమని పరోక్షంగా టీడీపీ అదినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని రాద్దాంతం చేస్తూ, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు సంధించారు.
సిద్ధాంతపరంగా వైఎస్ఆర్, ఎన్టీఆర్ విభిన్న ధృవాలైనా.. ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తించేలా ఓ జిల్లాకు సీఎం జగన్ పేరు పెట్టారని కోడాలి నాని అన్నారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరును ఓ జిల్లాకు పెట్టడాన్ని అభినందించాల్సిన తెలుగుదేశం.. దీనిని కూడా రాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. ఎన్టీఆర్‌ని ఆరాధించే వ్యక్తిగా, ఎన్టీఆర్ అభిమానుల తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్వ్యస్ధీకరణ చేపట్టామని కొడాలి నాని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పాలన జగన్ అందిస్తున్నారని మంత్రి కొనియాడారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిమ్మకూరు వాసులు కోరారని.. ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. ఇది హర్షించదగిన విషయమని అన్నారు.
ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్‌పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోందన్నారు. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, అయితే దురదృష్టవశాత్తు.. చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.