Begin typing your search above and press return to search.
బాలకోట్ దాడిలో ఎంతమంది చనిపోయారంటే..
By: Tupaki Desk | 5 March 2019 5:11 AM GMTజమ్మూలోని పూల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ యుద్ధ విమానాలతో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మిరాజ్-2000 యుద్ధ విమానాలతో ఉగ్ర శిబిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదుల చనిపోయినట్లు భారత్ ప్రాథమికంగా ప్రకటించింది. అయితే ఇంతవరకు పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం మృతులపై అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో భారత్ లోని ప్రతిపక్షాలు ఇదంతా మోడీ చేస్తున్న అసత్య ప్రచారమేనని కొట్టి పారేస్తున్నాయి.
అయితే తాజాగా ఎన్ టీఆర్ వో(జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ) కీలక సమాచారాన్ని బయటకు తెచ్చింది. భారత్ వైమానిక దాడులు జరిపే ముందు 300 మంది మొబైల్ ఫోన్లు ఆ ప్రాంతాల్లో యాక్టివ్ గా ఉన్నాయని, వారు విమాన దాడుల నుంచి తప్పించుకునేందుకు సిగ్నల్స్ ను ట్రేస్ చేశామని తెలిపారు. జైషే క్యాంపులపై భారత్ దాడుల నేపథ్యంలో బాలకోట్ వద్ద ఉన్న ఫోన్ కార్యకలాపాలపై దృష్టి సారించామని ఎన్ టీఆర్ వో తెలిపింది.
తమ వద్ద ఉన్న ఖచ్చితమైన సమాచారంతో 300 మంది ఉగ్రవాదులు దాడిలో చనిపోయారని భారత పరిశోధన సంస్థ తేల్చింది. కాగా విమాన దాడుల్లో 1000 కిలోల పేలుడు పదార్థాన్ని ఉగ్ర శిబిరాలపై విడిచినందున ఈ దాడుల్లో కచ్చితంగా అంతమంది ఒకేసారి హతమయ్యే అవకాశం ఉంటుందని పాకిస్తాన్ మీడియాలో కూడా వార్తలొచ్చాయి.