Begin typing your search above and press return to search.
కొవిడ్ -19 తగ్గినా ఆ ఎఫెక్ట్ ఉంటుందట
By: Tupaki Desk | 15 April 2021 2:30 AM GMTకోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తుల్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు దాపురిస్తున్నట్టు తాజా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులున్న వారికి ఇది మరింత ముప్పుగా మారిందట.. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి అతి చురుకైన రోగనిరోధక ప్రతిస్పందన కారణంగా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది.
సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల నేతృత్వంలోని ఈ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. కోలుకున్న తర్వాత కోవిడ్ -19 రోగుల్లో దెబ్బతిన్న రక్తనాళాల గోడల నుండి చిందించిన ఎండోథెలియల్ కణాల (సిఇసి) సంఖ్య సాధారణ సంఖ్య కంటే రెండింతలు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత రక్తనాళాల గాయం ఇంకా స్పష్టంగా కనబడుతుందని సిఇసిల స్థాయిలు సూచిస్తున్నాయి.
కోలుకున్న కోవిడ్ -19 రోగులు అధికస్థాయిలో సైటోకిన్‌లను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. రోగనిరోధక కణాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రోటీన్లు, వ్యాధికారక కారకాలకు వ్యతిరేకంగా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తోందని తేలింది. కోలుకున్న కోవిడ్ -19 రోగుల రక్తంలో వైరస్ లపై దాడి చేసి నాశనం చేసే టి కణాలు అసాధారణంగా అధిక సంఖ్యలో ఉన్నాయని అధ్యయనంలో తేలింది. సైటోకిన్లు.. అధిక స్థాయి రోగనిరోధక కణాలు ఉండటం ద్వారా కోలుకున్న కోవిడ్ -19 రోగుల్లో రోగనిరోధక వ్యవస్థ వైరస్ పోయినా రక్తం గడ్డకట్టేలా ప్రేరేపిస్తోందని తేలింది.
నిరంతరం ప్రేరేపిస్తున్న ఈ రోగనిరోధక ప్రతిస్పందనలు కోలుకున్న కోవిడ్ -19 రోగుల రక్తనాళాలపై దాడి చేస్తాయని, మరింత నష్టం కలిగిస్తుందని మరియు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని మరింత పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. "కోవిడ్ -19 ప్రధానంగా శ్వాసకోశాలపై దాడి చేస్తుంది. వైరస్ రక్తనాళాల లైనింగ్‌పై దాడి చేసి, మంటతోపాటు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ దెబ్బతిన్న నాళాల నుండి లీకేజ్ రక్తం గడ్డకట్టడాన్ని ప్రేరేపిస్తుంది. దీనివల్ల రోగులలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి." ఎన్టీయూ లీ కాంగ్ చియాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనా సహాయకుడు ఫ్లోరెన్స్ చియో చెప్పారు. డయాబెటిస్, గుండెకు సంబంధించిన వారికి దగ్గరగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది" అని ఎన్టీయూ లీ కాంగ్ చియాన్ స్కూల్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్టిన్ చెయుంగ్ తెలిపారు. ఈ బృందం 30 మంది కోవిడ్ -19 రోగుల నుండి రక్త నమూనాలను సేకరించి విశ్లేషించింది.