Begin typing your search above and press return to search.
పాక్ నోట తొలిసారి ‘‘అణు యుద్ధం’’ మాట
By: Tupaki Desk | 20 Oct 2015 9:21 AM GMTఅవాకులు చవాకులు పేలటం.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించటం.. సైనికుల మీద కాల్పులు జరిపి కవ్వించటం లాంటి చేష్టలకు పాల్పడే దాయాది దేశం పాకిస్థాన్ తన బుద్ధిని మరోసారి ప్రదర్శించింది. తాజాగా రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో.. భారత్ తో కానీ యుద్ధం వస్తే.. తమ వద్దనున్న అణ్వస్త్రాల్ని వినియోగిస్తామని వెల్లడించింది.
ఇంతకాలం తన అణ్వస్త్ర సామర్థ్యంపై పెద్దగా పెదవి విప్పని పాక్ అందుకు భిన్నంగా తాజాగా పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ చౌదరి వ్యాఖ్యానించారు. ఆయన నోట అణ్వస్త్ర మాట వచ్చిన విషయాన్ని పాక్ లోని ప్రముఖ మీడియా సంస్థ డాన్ వెల్లడించింది.
తక్కువ ప్రభావం చూపే అణ్వస్త్రాలను భారత్ తో కానీ యుద్ధం సంభవిస్తే వాటిని వినియోగిస్తామని ప్రకటించటం ద్వారా.. తన భాద్యతారాహిత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటేలా పాక్ వ్యవహరించింది. తమకున్న అణ్వస్త్ర సామర్థ్యం యుద్ధాల్ని ప్రేరేపించేందుకు కాదంటూ ఈ మధ్యన వ్యాఖ్యలు చేసిన పాక్.. అందుకు భిన్నంగా భారత్ మీద తనకున్న కంటగింపును విదేశాంగ శాఖ కార్యదర్శి వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పినట్లైందని చెప్పొచ్చు.