Begin typing your search above and press return to search.
న్యూడ్ సెల్ఫీ.. రణ్ వీర్ ను మించిపోయిన రస్సెల్..!
By: Tupaki Desk | 19 Nov 2022 6:35 AM GMTచెదిరిన జుట్టు.. చిరిగిన ప్యాంట్ వేసుకున్న ట్రెండ్ ను మనమంతా చూసే ఉంటాం. చిరిగిన ప్యాంట్ వేసుకున్న వాళ్లను చూసి మొదట్లో నవ్వుకున్నా జనాలు ఆ తర్వాత వాళ్లనే ఫాలో అయ్యారు. ఇక ఇప్పుడు కొత్తగా న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. దీనిని ఎంత మంది ఫాలో అవుతారో తెలియదు గానీ వీటిని చూసిన జనాలు మాత్రం ఇదేంట్రా బాబు.. అంటూ తలలు పట్టుకుంటున్నారు.
కొందరు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతుంటే.. పేరు ప్రఖ్యాతలు ఉన్న సెలబెట్రీలు కూడా ఇదే దారిని ఎంచుకోవడం విడ్డూరంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల తాను దిగిన న్యూడ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్త నెట్టింట్లో క్షణాల్లో వైరల్ గా మారింది.
రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోపై మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ సైతం నడిచాయి. నెటిజన్లు సైతం రణ్వీర్ న్యూడ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతోపాటు సెటైర్లు కూడా వేశారు. తాజాగా వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్.. కోలకత నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఒకే ఒక్క పోస్ట్ తో అందరినీ విస్మయానికి గురి చేశాడు.
రణ్వీర్ సింగ్ నగ్న ఫోటోను తలదెన్నేలా ఉన్నటువంటి నగ్న సెల్ఫీ పిక్ ను ఆండ్రీ రస్సెల్ తన ఇన్ స్ట్రాలో పోస్టు చేశాడు. అద్దం ముందు నిల్చొని రస్సెల్ దిగంబరంగా సెల్ఫీ దిగాడు. అయితే ఇందులో తన జననాంగం కన్పించకుండా ఒక పుర్రె ఫొటోను ఎమోజీతో కవర్ చేశాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో సైటర్లు వేస్తుండటంతో రస్సెల్ న్యూడ్ ఫొటో నెట్టింట్లో ట్రెండీగా మారింది.
ఇదిలా ఉంటే ఆండ్రీ రస్సెల్ టీ20 వరల్డ్ కప్-2022కు దూరంగా ఉన్నాడు. అతడితోపాటు సునీల్ నరైన్.. హెట్‌మైర్ సైతం ఆడకపోవడంతో వెస్టిండీస్ టీం క్వాలిఫయింగ్ రౌండ్లోనే వెనుదిరిగింది.
ఇక 2023 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ టీం రస్సెన్ ను రిటైన్ చేసుకుంది. కొద్దిరోజులుగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న రస్సెల్ ఐపీఎల్ లో ఆడేందుకు ఫిట్ నెస్ పై దృష్టి సారిస్తున్నాడు. ఏది ఏమైనా సెలబెట్రీలు తమ నగ్న ఫొటోలతో అందరి భయ పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.