Begin typing your search above and press return to search.
50కోట్లకు చేరిన ఇండియా నెటిజన్లు
By: Tupaki Desk | 21 Feb 2018 10:30 AM GMTనేటి ఆధునిక ప్రపంచంలో చాలా వరకు కమ్యూనికేషన్ పనులు ఇంటర్నెట్ తో ముడిపడ్డాయి. అదే సమయంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగిపోవడంతో అంతకు అంత ఇంటర్నెట్ వినియోగం పెరగిపోయింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 40 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులున్నారు. ఫేస్ బుక్ - వాట్సాప్ ఇంకా ట్విట్టర్ యాప్ ల వినియోగంలో నెలవారీ ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య భారత్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విభాగానికి వచ్చేసరికి, భారత్ లో ఈ సెక్టార్ 32 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపారాన్ని విస్తరించింది. భారత్ లో 25 శాతం ఉద్యోగాలను అడ్వాన్సుడ్ రోబోటిక్స్ హ్యాండిల్ చేస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఇది 45 శాతానికి కు విస్తరించే అవకాశం ఉంది. అత్యధిక మంది యక్టివ్ ఇంటర్జెట్ వినియోగదార్లను కలిగి ఉన్న దేశంగా భారత్ అభివృద్ధి చెందింది. రానున్న పదేళ్లలో ఇక్కడి డిజిటల్ లావాదేవీల సంఖ్య 100 ట్రిలియన్ డాలర్లకు రీచ్ అయ్యే అవకాశముండగా, ప్రస్తుతం 4,000గా ఉన్న యువ స్టార్టప్‌ల సంఖ్య 12000కు - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మార్కెట్ 2025 నాటికి 70బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఇంటర్నెట్ వినయోగం అమాంతం పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ఇన్ ఇండియా 217 అనే అంశంపై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ) - కంతర్ ఐఎంఆర్ బీ సంస్థలు ఓ సర్వేను నిర్వహించాయి. ఆ సర్వేలో 2017 డిసెంబరు నాటికి మొత‍్తం జనాభాలో ఇంటర్నెట్ వినియోగదారులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేసింది.
2017 జూన్ - ఆగస్టు నెలల మధ్య 170 నగరాల్లో 60వేల మందిని - గ్రామీణ ప్రాంతంలో 750 గ్రామాల్లో 15వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది.
జూన్ 2018 నాటికి మన దేశంలో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50కోట్ల (500 మిలియన్లు) మార్క్ ను అధిగమిస్తుందని తెలిపింది. ఢిల్లీ - ముంబై - కోల్ కతా నగరాలు అగ్రస్థానంలో ఉండగా - ఫతేపూర్ - జగదల్పూర్ - ఇంఫాల్ ఆఖరిస్థానంలో ఉన్నాయి.
ఆ రెండు సంస్థలు నిర్వహించిన సంయుక్త సర్వే ప్రకారం 2016-2017 డిసెంబర్ నాటికి అర్బన్ ఇండియాలో 9.66 శాతం వృద్ధి సాధించి 295 మిలియన్లమంది - గ్రామీణ ప్రాంతాల్లో 14.11శాతం వృద్ధితో 186 మిలియన్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. రోజువారీ వినియోగించుకున్నారని నివేదిక పేర్కొంది.