Begin typing your search above and press return to search.
ఆడోళ్లే మందుకొట్టి బళ్లు నడుపుతున్నారట
By: Tupaki Desk | 6 Oct 2015 9:16 AM GMTడ్రంక్ అండ్ డ్రైవ్ లు చేపట్టిన ప్రతిసారీ పలువురిని అదుపులోకి తీసుకోవటం.. కేసులు బుక్ చేయటం తెలిసిందే. అయితే.. ఇలాంటి కేసుల్లో మగాళ్లే కాదు.. ఈ మధ్యన ఆడోళ్లు బాగానే పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది తొమ్మిది నెలల్లో (సెప్టెంబరు వరకు) పట్టుబడిన మహిళలకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా.. ఆశ్చర్యాన్ని రేకెత్తించేలా ఉన్నాయి.
ఈ ఏడాది తొమ్మిది నెలల్లో హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మహిళల సంఖ్య 22కు చేరింది. ఇది గత ఏడాది కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. చట్టంలో పొందుపర్చిన మోతాదుకు మించి వీరు మద్యం సేవించి వాహనాల్ని నడపటం ఒక విశేషమైతే.. వీరంతా కొన్ని ప్రాంతాలకు చెందిన వారే కావటం గమనార్హం.
ఇలా పట్టుబడిన వారిలో అత్యధికులు జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్.. గచ్చిబౌలి..శ్రీనగర్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని చెబుతున్నారు. ఇక.. పట్టుబడిన వారి ఆర్థిక పరిస్థితి చూస్తే.. మధ్య తరగతి నుంచి ధనిక వర్గాల మహిళలే ఉంటున్నారు. ఇక.. పట్టుబడిన మహిళల వృత్తులు చూస్తే.. ఐటీ.. డాక్టర్లు.. వ్యాపారాలు చేసే వారు ఉన్నారు.
ఇలా పట్టుబడిన వారికి రూ.2వేల జరిమానాతో పాటు.. గోషామహాల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో కౌన్సిలింగ్ ఇచ్చారట. ఇక.. పట్టుబడిన మహిళల్లో అత్యంత పిన్న వయసు ఉన్న మహిళకు 21 ఏళ్లు ఉండి.. ఒక బీపీఏ కంపెనీలో ఉద్యోగిని కాగా.. పెద్ద వయస్కురాలు మాత్రం 35 ఏళ్ల గృహిణిగా చెబుతున్నారు. భాగ్యనగరిలో పెచ్చు పెరిగిపోతున్న ఈ వైఖరి ఎక్కడి వరకు వెళుతుందో..?