Begin typing your search above and press return to search.
ఆమెను రేప్ చేస్తామని.. చంపేస్తామంటున్నారు? ఇదెవరికి పట్టదా?
By: Tupaki Desk | 19 July 2022 7:30 AM GMTమాజీ బీజేపీ నేత నూపుర్ శర్మ చేసినట్లుగా చెప్పే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రగిలిన నిరసనలు.. ఆందోళనలు ఒక ఎత్తు అయితే.. ఆమె చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు సంచలనంగా మారటం తెలిసిందే.
నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీం రియాక్టు అయిన తీరుపై పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు మందలింపు తర్వాత నూపుర్ శర్మ పరిస్థితి దారుణంగా మారినట్లుగా చెబుతున్నారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్న నూపుర్ శర్మ తీరును దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. సీరియస్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఆమెకు ప్రాణహాని పెరగటంతో పాటు.. ఆమెను రేప్ చేస్తామని.. చంపేస్తామని హెచ్చరికలు చేస్తున్నారన్నారు. తనపై వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నింటిని భద్రతా కారణాలతో కలిపి విచారించాలని సుప్రీంకోర్టులో ఆమె మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు.
గతంలోనూ ఆమె ఇదే తరహా పిటిషన్ దాఖలు చేయటం.. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఆమె పిటిషన్ ను తిరస్కరించటం తెలిసిందే. ఆ సందర్బంగా నూపూర్ తీరును తీవ్రంగా మందలించింది. అయితే.. తాజా పిటిషన్ ను సైతం.. గతంలో పిటిషన్ ను విచారణకు రిజెక్టు చేసిన జస్టిస్ సూర్యకాంత్.. జస్టిస్ పార్టీవాలాతో కూడిన ధర్మాసనమే మరోసారి విచారించనుంది.
మరి.. ఈసారి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చూడాలి. మరోవైపు ఆమెకు దారుణమైన రీతిలో హెచ్చరికలు చేస్తున్న వారి సంగతేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. దేశంలో తప్పు చేస్తే దాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా విచారణ జరిపి.. అందులో తప్పులున్నట్లు తేలితే.. వారికి శిక్ష విధిస్తారు.
అయితే.. అందుకు భిన్నంగా ఆమెను ఉద్దేశించి దారుణమైన రీతిలో రేప్ చేస్తామని.. హత్య చేస్తామంటూ వార్నింగ్ లు ఇస్తూ చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్న వారికి తగిన శిక్ష విధించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈసారి విచారణలో ఆయా అంశాలపై సుప్రీం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.