Begin typing your search above and press return to search.
ఫస్ట్ ఎయిడ్ చేస్తూ షాక్ తిన్న నర్స్
By: Tupaki Desk | 22 Nov 2015 7:55 AM GMTమిగిలిన వృత్తులు ఎన్ని ఉన్నా.. ప్రాణం మీదకు వచ్చినప్పుడు పరుగు పరుగున వెళ్లేది ఆసుపత్రికే. డాక్టర్ అందుబాటులో లేనప్పుడు.. ప్రధమ చికిత్స చేసేందుకు నర్సు తన శాయశక్తులా కృషి చేస్తుంటారు. విడి రోజుల్లో ఇలా ఉంటే.. పెద్ద ఎత్తున ఉగ్రదాడి జరిగి వందలాది మంది మరణించిన సమయంలో ఎప్పుడేం జరుగుతుందో గుర్తించేంత సమయం కూడా ఉండదు. దాదాపుగా అలాంటి పరిస్థితే ప్యారిస్ లో ఉగ్రదాడి సందర్భంగా చోటు చేసుకుంది.
దాడుల్లో భాగంగా పలుచోట్ల ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఓ రెస్టారెంట్ లోకి చొరబడిన తీవ్రవాదులు అక్కడి వారిపై కాల్పులు జరిపారు. దీంతో.. ఆ ప్రాంతమంతా హాహాకారాలు.. క్షతగాత్రులు.. రక్తం ఓడుతున్న వారితోనిండిపోయింది. ఈ సమయంలో డేవిడ్ అనే 46 ఏళ్ల నర్స్ అక్కడి వారికి సాయం అందిస్తున్నాడు.
ఒక మహిళలకు ప్రధమ చికిత్స జరిపి.. అనంతరం గాయపడిన ఒక వ్యక్తి వద్దకు చేరుకున్నాడు. అతనికి గుండె కొట్టుకునేందుకు చికిత్స చేస్తున్న సమయంలో అతని చేతికి కొన్ని వైర్లు తగిలాయి. దీంతో.. మరింత జాగ్రత్తగా చూడగా.. తాను సాయం చేస్తున్నది మానవ బాంబర్ కి అన్న విషయం తెలిసి ఒక్కసారి షాక్ అయ్యాడు.
వెంటనే.. తన వైద్యం ఆపేసి.. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే.. ఆ చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేసిన పోలీసులు.. సదరు బాంబర్ కు ఉన్న బాంబును నిర్వీర్యం చేశారు. ఆపై సదరు ఉగ్రవాది ఎవరన్నది పోల్చి చూస్తే.. అతను అట్లాంటి ఇలాంటి బాంబర్ కాదని.. ప్రముఖ ఉగ్రవాది అబ్దెస్లామ్ అని తెలిసి మరోసారి షాక్ తిన్నారు. ఇక.. అతడికి వైద్య సాయం అందింబోయిన నర్సు డేవిడ్ పరిస్థితి అయితే.. వర్ణించలేనంత భారీ షాక్ లో కూరుకుపోయాడట.