Begin typing your search above and press return to search.
ఎంపీలై ఉండి ఇలాంటి డ్రెస్సులేస్తారా?
By: Tupaki Desk | 30 May 2019 10:12 AM GMTఈసారి పార్లమెంటులో అందమైన మహిళా ఎంపీల్ని చూడబోతున్నాం. తెలుగు సినిమాల్లో నటించి ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన రవి రాణా అనే ఎమ్మెల్యేను పెళ్లాడిన నవనీత్ కౌర్ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగాల్ నుంచి ఇద్దరు అందమైన ఎంపీలు పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు. వారి పేర్లు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్. వీళ్లిద్దరూ అందగత్తెలు కావడం, పైగా వారి వయసూ తక్కువ కావడంతో మీడియా ఫోకస్ వారిపై చాలానే ఉంటోంది.
ఐతే సినిమాల్లో ఎలా కనిపించినా, ఎలాంటి బట్టలేసుకున్నా.. ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యాక డ్రెస్సింగ్ మార్చాల్సి ఉంటుంది. కొంచెం సంప్రదాయబద్ధంగా కనిపించాలని జనాలు కోరుకుంటారు. కానీ ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సంప్రదాయం మార్చాలని చూసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎంపీలుగా ఎన్నికైన తర్వాత మిమి, నుస్రత్ తొలిసారి పార్లమెంటుకు వచ్చి ఫొటోలు దిగగా.. ఆ సమయంలో వారు ధరించిన దుస్తులు విమర్శలకు కారణమయ్యాయి. వీళ్లిద్దరూ కొంచెం సెక్సీగా కనిపించే టీషర్ట్, టాప్ వేసుకున్నారు. జీన్స్ కూడా ధరించారు. వాళ్లు ఫొటోలకు పోజులిచ్చిన తీరు కూడా విమర్శలకు కారణమైంది. దీంతో సోషల్ మీడియా జనాలు వాళ్లపై పడిపోయారు.
ఎంపీలై ఉండి ఎలాంటి బట్టలేసుకోవాలన్న సెన్స్ లేదా.. అది పార్లమెంటు అనుకున్నారా.. లేక సినిమా సెట్ అనుకున్నారా.. ఫ్యాషన్ షో మాదిరి ఆ పోజులేంటి అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఐతే తమను విమర్శించిన వాళ్లకు మిమి, నుస్రత్ దీటుగా సమాధానం ఇచ్చారు. ''మేం యవ్వనంలో ఉన్నా, మేం ఎందుకు జీన్స్, టీషర్టులు ధరించకూడదు? వీళ్లంతా మేం వేసుకున్న బట్టల్ని చూసి చాలా బాధపడిపోతున్నారు. కానీ క్రిమినల్ కేసులు, అవినీతి మరకలు ఉండి పవిత్రమైన వ్యక్తుల్లాగా దుస్తులు ధరించే పార్లమెంటు సభ్యుల్ని మాత్రం వీళ్లు పట్టించుకోరు'' అని ఆమె విమర్శించారు.
30 ఏళ్ల మిమి చక్రవర్తి ఇప్పటి వరకూ 20కి పైగా చిత్రాల్లో నటించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాపై దాదాపు 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందింది . దాదాపు 20 చిత్రాల్లో నటించిన 29 ఏళ్ల నుస్రత్ జహాన్ బసిర్హత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి శంతను బసుపై 3 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో నెగ్గింది.