Begin typing your search above and press return to search.

విడాకుల త‌ర్వాత ప్రెగ్నెన్సీ.. నేనేం త‌ప్పు చేయ‌లేదుః హీరోయిన్‌

By:  Tupaki Desk   |   17 Jun 2021 12:30 PM GMT
విడాకుల త‌ర్వాత ప్రెగ్నెన్సీ.. నేనేం త‌ప్పు చేయ‌లేదుః హీరోయిన్‌
X
జీవితం స‌జావుగా సాగాల‌నే అంద‌రూ కోరుకుంటారు. కానీ అనుకోని అవాంత‌రాలు ఒడిదొడుకులు క‌లిగించొచ్చు. అవి చాలా తీవ్రంగా కూడా ఉండొచ్చు. బెంగాల్ స్టార్ హీరోయిన్‌, పార్ల‌మెంటు స‌భ్యురాలు నుస్ర‌త్ జ‌హాన్ జీవితంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర‌య్యాయి. వాటి తీవ్ర‌త కూడా చాలా పెద్ద‌దే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ త‌ర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే.. అనంత‌రం ఆమె గ‌ర్భ‌వ‌తి అనే విష‌యం మ‌రింత సంచ‌ల‌నం సృష్టించింది.

నుస్ర‌త్ జ‌హాన్‌.. నిఖిల్ జైన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ.. కాపురంలో విభేదాలు త‌లెత్త‌డంతో అనివార్యంగా ఇద్ద‌రూ విడిపోయారు. అయితే.. ఆ త‌ర్వాత స‌హ న‌టుడు య‌ష్ దాస్ గుప్తాతో డేటింగ్ చేయ‌డం.. ఆ త‌ర్వాత ఆమె గ‌ర్భ‌వ‌తి అన్న విష‌యం వెలుగులోకి రావ‌డం సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ విష‌య‌మై నుస్ర‌త్ సానుకూలంగా స్పందించిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి.

అయితే.. తాజాగా నుస్ర‌త్ సినీ క‌రెర్ ప‌దేళ్లు పూర్తి చేసుకుంది. ఆమె తొలి చిత్రం షోత్రూ విడులై జూన్ 15వ తేదీకి ప‌దేళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టారు నుస్ర‌త్. ఈ పదేళ్ల సినీ జీవితంలో వెన‌క్కి తిరిగి చూసుకుంటే.. త‌న‌కు చాలా గ‌ర్వంగా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. ఎన్నోక‌ష్టాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో అనుభ‌వాల‌తో ప‌దేళ్ల జీవితం గ‌డిచిపోయింద‌ని భావోద్వేగానికి లోన‌య్యారు.

ఇదిలా ఉంటే.. త‌న విడాకుల‌కు కార‌ణ‌మైన వారి గురించో.. లేదంటే మాజీ భ‌ర్త గురించో తెలియ‌దుగానీ.. సోష‌ల్ మీడియాలో ఇండైరెక్ట్ అటాక్ చేస్తున్నారు నుస్ర‌త్‌. విడిపోయిన త‌ర్వాత నుంచి త‌ర‌చూ ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. ‘‘ఎవ‌రో నా నోరు మూయించిన మ‌హిళ‌గా న‌న్ను నేను ఎప్ప‌టికీ గుర్తుంచుకోను. ఆ విష‌యంలో నేను త‌ప్పు చేసిన ఫీలింగ్ నాకు లేదు.’’ అంటూ మరో పోస్టులో రాసుకొచ్చారు. దీంతో.. పెళ్లి గాయాలు ఆమెను ఇంకా వేధిస్తూనే ఉన్నాయన్న విషయం అర్థమవుతోందని అంటున్నారు.