Begin typing your search above and press return to search.

మీ కొడుక్కి తండ్రి ఎవరు? నటి ఇచ్చిన ఘాటు సమాధానం ఏమంటే?

By:  Tupaki Desk   |   11 Sep 2021 3:19 AM GMT
మీ కొడుక్కి తండ్రి ఎవరు? నటి ఇచ్చిన ఘాటు సమాధానం ఏమంటే?
X
ప్రముఖుల ప్రైవేటు జీవితాల గురించి.. దానికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి.. కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అందులోని అనూహ్య ఉదంతాలకు సంబంధించి వార్తల్లో కనిపించే వారి పట్ల మరింత ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ అత్యుత్సాహం వారి ఆగ్రహానికి కారణమవుతూ ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితిని ఒక రిపోర్టర్ కొని తెచ్చుకున్నారు. బెంగాలీ నటి కమ్ తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్రత్ జహాన్ కు అనూహ్యమైన ప్రశ్న ఒకటి ఎదురైంది. ఇటీవల కాలంలో ఆమె తరచూ వార్తల్లోకి వస్తున్నారు. దీనికి ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఒక కారణంగా చెప్పాలి.

నటి సుస్రత్ జహాన్ 2019లో వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె ఎంపీగా తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. దీంతో.. ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకోవటం ఎక్కువైంది. ఇదిలా ఉంటే.. 2020 నుంచి విభేదాల కారణంగా దంపతులు ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. 2021లో భారతీయ చట్టాల ప్రకారం తమ వివాహం చెల్లదని సదరు నటి పేర్కొనటం హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే.. ఈ వ్యాఖ్య చేసిన సమయంలో సస్రత్ జహాన్.. బెంగాలీ నటుడు యశ్వంత్ దాస్ గుప్తాతో రిలేషన్ లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్లే.. గత నెలలో ఆమె ఒక మగ బిడ్డకు జన్మను ఇవ్వటం చర్చగా మారింది. ఇదిలా ఉండగా.. డెలివరీ తర్వాత తొలిసారి ఆమె తాజాగా ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఒక రిపోర్టర్ ఊహించని రీతిలో షాకింగ్ క్వశ్చన్ వేశారు. 'బిడ్డకు తండ్రి ఎవరు?' అని ప్రశ్నించారు. దీంతో.. తీవ్ర అసౌకర్యానికి గురైన సదరు మహిళా ఎంపీ ఘాటుగా రియాక్టు అయ్యారు. 'బిడ్డ తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు' అంటూ బదులిచ్చారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఇబ్బందుల్ని సుస్రత్ కు మరిన్ని తప్పవన్న మాట వినిపిస్తోంది. మరి.. అలాంటి పరిస్థితుల్ని ఆమె ఎలా డీల్ చేస్తారో చూడాలి.