Begin typing your search above and press return to search.
నూతన్ నాయుడు చీటర్..ఏపీ సీఎంవో అధికారి సంచలనం
By: Tupaki Desk | 5 Sep 2020 1:10 PM GMTవిశాఖపట్నం జిల్లా పెందుర్తిలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో బిగ్ బాస్ సెలెబ్రెటీ, దర్శకుడు నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో ఇప్పుడు దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి.
నూతన్ నాయుడు తన భార్య ప్రియను కాపాడేందుకు ఏకంగా ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీగా పనిచేస్తున్న పీవీ రమేశ్ తోపాటు మరికొందరి పేర్లను వాడుకొని మోసాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులకు ఫోన్లు చేసినట్టు సమాచారం. దీనిపై తాజాగా పీవీ రమేశ్ స్పందించారు.
నూతన్ నాయుడు మోసగాడని.. 8297989375 తోపాటు ఇతర నంబర్ల నుంచి తన పేరు చెప్పి పలువురికి ఫోన్లు చేశాడని.. డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీ పీవీ రమేశ్ ట్వీట్ చేశారు. తన పేరు చెప్పి దండుకోవడం చూసి షాక్ అయ్యానని.. తన పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేశాడని ఆయన మండిపడ్డారు. తన పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని కోరారు. అలాంటి ఫోన్లు వస్తే తనకు కానీ.. డీజీపీకి కానీ ఫోన్ చేయాలని తన నంబర్ ను కూడా పీవీ రమేశ్ ట్వీట్ లో పేర్కొన్నాడు.
ఇలా నూతన్ నాయుడులోని అక్రమాలను ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీ పీవీ రమేశ్ బయటపెట్టి సంచలనం రేపారు. ఈ కేసులో నూతన్ చాలా అక్రమాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంతేకాదు.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.