Begin typing your search above and press return to search.
ఇలా అయితే.. పార్లమెంటు పరిఢవిల్లేనా? జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 15 Aug 2021 11:30 AM GMTసుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు తీరుపై ఆయ న ఒకింత అసహనం ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి.. 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యం లో పంద్రాగస్టు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టులోనూ పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చిన జస్టిస్ రమణ.. ఈ సందర్భంగా న్యాయనిపుణులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ మెంబర్లను ఉద్దేశించి.. ప్రసంగించారు.
అయితే.. ఆయన ప్రసంగంలో ఆసాంతం పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలపై అసహనమే తొంగి చూసినట్టు అయింది. ఇటీవల కాలంలో పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలు నిజానికి.. ప్రతి ఒక్క రికీ ఇబ్బందిగానే ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో.. పార్లమెంటు దేవాలయం అనే మాట వినిపిస్తున్నా.. సభ్యులు వ్యవహరించే తీరు.. ప్రభుత్వం హైజాక్ చేయాలనే ఉద్దేశాలతో పార్లమెంటు ప్రతిష్ట ఎప్పటి కప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇటీవల మరీ దారుణంగా.. రాజ్యసభలో ఎంపీలు, మార్షల్స్ మధ్య జరిగిన వివాదం.. ఈ సందర్భంగా చైర్మన్ వెంకయ్య కన్నీరు పెట్టుకున్న ఘటన.. దేశంలో చర్చకు దారితీసింది.
బహుశ ఇవే విషయాలపై జస్టిస్ ఎన్వీ రమణ ఒకింత ఆవేదన చెంది ఉంటారేమో.. అందుకే ఆయన చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో ఇవే అంశాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. పార్లమెంట్‌లో చట్టాలు చేస్తున్న తీరుపై లోతైన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో చట్టాలపై లోతైన చర్చ జరగపోవడంపై విచారం వ్యక్తం చేశారు. నాణ్యమైన చర్చ లేకుండా చట్టాలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతా యని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో, ఆ చట్టం ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు.. చట్ట సభల్లో న్యాయవాదులు, మేధావులు ఎక్కువగా లేకపోవడం వల్లే చట్టాలపై లోతైన చర్చ జరగడం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. చట్టాల్లో ఎన్నో లోపాలుంటున్నాయని, దీంతో కోర్టుల్లో వ్యాజ్యాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి లోపభూయిష్ట చట్టాలు ప్రజలకు, ప్రభుత్వానికి భారంగా మారుతా యన్నారు. పార్లమెంట్‌లో ఒకప్పుడు న్యాయదిగ్గజాలు సభ్యులుగా ఉండేవారని, గతంలో చర్చల నాణ్యత అద్భుతంగా ఉండేదని తెలిపారు. పారిశ్రామిక వివాదాల చట్టంపై గతంలో పార్లమెంటులో జరిగిన చర్చను తాను స్వయంగా చూశానని జస్టిస్ రమణ చెప్పుకొచ్చారు.
అప్పట్లో తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) సభ్యుడు రామ్మూర్తి ఎంతో విపులంగా పరిశ్రమల వివాద బిల్లును విశ్లేషించా రని జస్టిస్ట్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. కార్మికులు, వివిధ రంగాలపై ఆ బిల్లు చూపే ప్రభావాన్ని ఎంపీ రామ్మూర్తి లోతుగా విశ్లేషించి చెప్పారని, ఇప్పుడు అలాంటి లోతైన విశ్లేషణ పార్లమెంట్ లో కరువైందని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయవాదులు కూడా ప్రజాజీవితంలోకి, చట్ట సభలకు రావాలని సీజేఐ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. న్యాయవాదులకు సంపాదనే పరమావధి కాకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు.