Begin typing your search above and press return to search.

సినిమాలు, తెలుగు భాషపై జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 Dec 2021 11:30 AM GMT
సినిమాలు, తెలుగు భాషపై జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
X
ఒకప్పుడు సినిమాలు చూసి తెలుగు ఉచ్ఛారణను నేర్చుకున్నామని.. తెలుగు భాషకు సినిమాలు పట్టం కట్టాయని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి తెలుగు సినీ నటులు, గాయనీ గాయకులకు తెలుగు సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా బాధ్యతగా తెలుగు నేర్చుకోవాలని సూచించారు.

తెలుగు భాష సంస్కృతీ ఔన్నత్యాలను తెలుగు వారంతా కాపాడుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఘంటసాల వేంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకలకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలుగు భాషా సంస్కృతులు, విలువలు పడిపోతున్నాయని.. భాషా ఔన్నత్యాన్ని పెంచడంలో ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదని ఎన్వీ రమణ అన్నారు. ఘంటసాల లాంటి గొప్ప నాయకడన్న తెలుగు సినిమా రంగంలో తెలుగు భాష రోజురోజుకి దిగజారిపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో గానకోకిల పి.సుశీలను ఘంటసాల శతజయంతి పురస్కారంతో సత్కరించారు.

సినీ రంగమే తెలుగు వైభవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరారు. సామాజిక సృహగల సినిమాలు మాత్రమే చర్చనీయాంశమవుతాయని.. అలాంటి మంచి సినిమాలు తీయాలంటే భాష, సాహిత్య, సంస్కృతులపై ఎంతో పట్టు ఉండాలన్నారు.

ఈ సందర్భంగా గానకోకిల పి.సుశీలను ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారంతో జస్టిస్ ఎన్వీ రమణ ఘనంగా సత్కరించారు. ఆమెకు రూ.లక్ష నగదు, నూతన వస్త్రాలు, శాలువాను ప్రధానం చేశారు. ఘంటసాలతో కలిసి వేలాడి పాటలు పాడిన తాను ఆయన శతజయంతి సందర్భంగా పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సుశీల చెప్పారు.