Begin typing your search above and press return to search.

మీకు మూడే ఆప్షన్లు .. కేంద్రంపై ఎన్వీ రమణ అసహనం

By:  Tupaki Desk   |   6 Sep 2021 8:40 AM GMT
మీకు మూడే ఆప్షన్లు .. కేంద్రంపై ఎన్వీ రమణ అసహనం
X
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రైబ్యునల్స్‌ లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించింది. దేశంలోని వివిధ ట్రైబ్యునల్స్‌ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సుప్రీం కోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ట్రైబ్యునల్స్‌ లో ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వారం రోజుల గడువు విధించింది. ఖాళీల భర్తీకి సంబంధించి జరిగిన విచారణలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.

మేం చాలా అసంతృప్తిగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును గౌరవిస్తున్నట్టు కనిపించడం లేదు. మీర మా సహనాన్ని పరీక్షిస్తున్నారు అంటూ అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రంతో తాము ఘర్షణకు దిగాలనుకోవడం లేదని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో వేగంగా స్పందించిన తీరును ఆయన ప్రస్తావించారు. కేంద్రంలోని కొన్ని ప్రముఖ ట్రిబ్యునల్స్‌ అయిన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ లాంటి వాటిలో కూడా ఖాళీలు ఉన్నాయి. అవి ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనవి. సైనిక దళాలు, వినియోగదారుల ట్రైబ్యునల్స్‌ లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. దాని వల్ల చాలా కేసుల పరిష్కారం ఆలస్యం అవుతోంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ట్రైబ్యునల్స్‌లో ఖాళీలను భర్తీచేయడానికి కనీసం రెండు నెలలు పడుతుందంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినట్టు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు మండిపడింది. ‘ఖాళీలు ఇప్పుడు కాదు. రెండేళ్లుగా ఉన్నాయి. ఇంకా ఎందుకు వాటిని భర్తీ చేయలేదు. మీరు ట్రైబ్యునల్స్‌ను జావగారుస్తున్నారు అని జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ఇక ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టం ఒక ప్యాట్రన్‌లా మారిపోయిందని మరో జస్టిస్ డీవై చంద్రచూడ్ కామెంట్ చేశారు. ఇదో పద్ధతి అయిపోయింది. మేం ఒకదాన్ని కొట్టేస్తే మరోదాన్ని తీసుకొస్తున్నారు అని ఆయన అన్నారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మూడు ఆప్షన్లు ఇచ్చారు.ట్రైబ్యునల్ సంస్కరణల చట్టాన్ని కొనసాగించి వెంటనే ఖాళీలను భర్తీ చేయడం.సుప్రీంకోర్టే స్వయంగా ట్రైబ్యునల్స్‌ను మూసేయడంట్రైబ్యునల్స్‌‌లో ఖాళీలను కూడా సుప్రీంకోర్టే భర్తీ చేయడం. ఈ మూడు ఆప్షన్లు కాకుండా కేంద్రం మీద కోర్టు ధిక్కరణ ఆప్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హెచ్చరించారు. కాబట్టి వారం రోజుల్లో ట్రైబ్యునల్స్‌లో ఖాళీలను భర్తీ చేయాలని గడువు విధించారు.