Begin typing your search above and press return to search.
ఫిరాయిస్తే పాపాలన్నీ పోయినట్టేనా?
By: Tupaki Desk | 20 Aug 2017 4:41 AM GMTప్రతిపక్ష ఎమ్మెల్యేలను నయానో భయానో - ప్రలోభాలకు గురిచేసో.. అధికార పార్టీలోకి లాగేసుకునే కుసంస్కృతి ఇటీవల బాగా పెరిగిపోయింది. ఏపీలోని 21 మంది తమ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రలోభాలకు గురిచేసి సైకిలెక్కి చేసుకుందని విపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. దీనిని ఎంతమంది ఖండిస్తున్నా.. ప్రజాస్వామ్య విలువలు మంటగలిశాయని ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా... టీడీపీ సర్కారు అవేమీ పట్టించుకోవడం లేదన్న వాదన లేకపోలేదు.
కొంతమంది అవకాశవాదులు తమపై ఉన్నఅవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి కూడా అధికార పార్టీలోకి జంప్ అయిపోయారు. ఇలాంటి వ్యవహారాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీలోకి ఫిరాయిస్తే పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయినట్టు ఫీలవుతున్నారంటూ ఆయన చేసిన ఘాటైన విమర్శలు ఇప్పుడు వైరల్ గానే మారిపోయాయని చెప్పక తప్పదు. అధికార పార్టీలోకి జంప్ చేస్తే పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయని, నేరాలన్నీ సమసిపోతాయనే భావన రాజకీయ నాయకుల్లో పెరిగిపోతోందని ఓపీ రావత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలు - రాజకీయ సంస్కరణలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టసభల సభ్యులను తమవైపు తిప్పుకోవడం, డబ్బులు వెదజల్లి ఆకర్షించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి బెదిరించడం మొదలైనవి తెలివైన రాజకీయ నిర్వహణగా చెప్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకులు అధికార పార్టీలోకి ఫిరాయిస్తే తాను చేసిన నేరాలతో పాటు అన్ని అపరాధాలు తొలగిపోతాయనే భావన కూడా పెరిగిపోతోందని కూడా రావత్ ఆందోళన వ్యక్తం చేశారు.