Begin typing your search above and press return to search.
తమిళనాడులో ఏం జరగనుంది..?
By: Tupaki Desk | 8 Feb 2017 4:39 AM GMTఊహాగానాలకు అంచనాలకు మధ్య వ్యత్యాసం భారీగానే ఉంటుంది. ఏదైనా ఊహించేయొచ్చు.కానీ.. అంచనా చెప్పేటప్పుడు.. అందుకు తగిన వాదనను వినిపించాల్సి ఉంటుంది. మిగిలిన అంశాల్లో అంచనాలకు.. అనిశ్చితి నిండిన రాజకీయాల్లో అంచనాల్ని లెక్క కట్టానికి మధ్య వ్యత్యాసం కాస్త ఎక్కువే. తాజా తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసలేం జరుగుతుంది? ఏం జరగనుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇప్పటివరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరగనుందన్న అంచనా వేస్తే..
1. అమ్మ ఆత్మ తనను ఆదేశించినట్లుగా చెబుతున్న పన్నీర్ సీఎం కావటం.అదెలా అన్నది చూస్తే.. ఒకటి అన్నాడీఎంకే భారీగా చీలిపోయి మెజార్టీ వర్గం పన్నర్ చెంతన చేరటం. అది సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. దీనికి తోడు తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు ఉన్న మెజార్టీ ఒక మోస్తరు మాత్రమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం పన్నీర్ వెంట 50 మంది కంటే కాస్త ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే.. అన్నాడీఎంకే వాస్తవ బలంలో సగం మాత్రమే. ఆ బలంతో పన్నీర్ తనకు తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అయితే.. పన్నీరుకు మద్దతు ఇచ్చేందుకు డీఎంకే నేత స్టాలిన్ సిద్ధంగా ఉన్నారు. ఆ పార్టీకి తమిళనాడు అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. పన్నీర్ ఇందుకు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఒక ప్రశ్న. స్టాలిన్ మద్దతుతో పన్నీర్ కానీ సీఎం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటే.. అందుకు పచ్చజెండా ఊపేందుకు కేంద్రం సైతం సిద్ధంగాఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి.
2. చిన్నమ్మకు మద్దుతుగా ఉన్న ఎమ్మెల్యేల లెక్క మీద ఆసక్తికర వాదన ఉంది. ఆమెకు 70 మంది వరకూ ఉన్నారని చెబుతున్నారు. చిన్నమ్మకు వారంతా అంత విధేయతగా ఉండటానికి కారణం.. వారికి టిక్కెట్లు ఇప్పించింది చిన్నమ్మేనని చెబుతున్నారు. అయితే.. ఇప్పటివరకూ ఉన్న లెక్కల ప్రకారం చిన్నమ్మ సీఎం అయ్యే అవకాశాలు చాలా తక్కువని చెప్పాలి. సుప్రీం విచారణలో ఉన్న అక్రమాస్తుల కేసు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సొంత బలం.. అన్నింటికి మించి.. కేంద్రం ఆశీస్సులు లేకపోవటం మైనస్ గా చెప్పాలి. వీటికి తోడు.. ప్రజల్లో ఆమెకు సానుకూలత లేకపోవటం. అయినప్పటికీ చిన్నమ్మ సీఎం కావాలంటే మాత్రం.. ఇప్పటికే పన్నీరు వర్గంలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 35 మందికి పైగా ఎమ్మెల్యేల్ని తన వైపునకు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చిన్నమ్మకు మద్దతు ఇచ్చేందుకు మరే ఇతర రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోవటం. వీటన్నింటిని చూస్తే.. చిన్నమ్మ సీఎం కావటం చాలా చాలా కష్టమని చెప్పాలి.
3. పన్నీర్ ఎగురవేసిన తిరుగుబావుటా అనుకున్నట్లు ఆయనకు పవర్ చేతికి అందకపోతే ఏం జరుగుతుందన్నది చూస్తే.. అంతిమంగా రాష్ట్రపతి పాలనే ఖాయమవుతుంది. శశికళ విషయంలో కేంద్రం పట్టుదలతో ఉండటం.. ఆమెను సీఎం చేయకూడదన్న ఆలోచనలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతిపాలన దిశగా నిర్ణయం తీసుకునే వీలుంది. అయితే.. ఈ దిశగా నిర్ణయం తీసుకోవటానికి కేంద్రం అంత ఆసక్తిని ప్రదర్శించకపోవచ్చు. ఎందుకంటే.. రాష్ట్రపతి పాలన నిర్ణయం కేంద్రానికి నెగిటివ్ గా మారే అవకాశం ఉంది. తమిళనాడు మీద తన అధిపత్యం పెంచుకోవటం కోసమే మోడీ నేతృత్వంలోని బీజేపీ కావాలనే ఇలా చేసిందనే అభిప్రాయానికి తమిళులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. బీజేపీకి జరిగే నష్టం భారీగా ఉంటుంది.
4. తమిళనాడు రాజకీయాల్ని వదిలేసి.. తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయాలు. విపక్ష డీఎంకేకు ఇప్పటికే 89 మంది ఎమ్మెల్యేల బలం ఉండటం.. పవర్ అవసరమైన ఎమ్మెల్యేలు 118 అయిన నేపథ్యంలో.. మరో 19మంది ఎమ్మెల్యేలు. కాదంటే 20 మంది ఎమ్మెల్యే అవసరం మాత్రమే ఉంటుంది. వారిని తమ వైపునకు తిప్పుకోగలిగితే డీఎంకే అధికారపక్షంగా అవతరించే అవకాశం ఉంది. మరి.. అలాంటి అవకాశం లేదా? అంటే లేదంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. అలాంటి రాజకీయమే చేస్తే..స్టాలిన్ రాజకీయభవిష్యత్తుచిక్కులో పడటమే కాదు.. ఆయనకు మద్దతు ఇచ్చిన 20 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు సమాధి అయినట్లే. ఆత్మహత్యాసాదృశ్యకమైన ఈ తరహా నిర్ణయాన్ని తీసుకునే సాహసాన్ని అమ్మ ఎమ్మెల్యేలు చేయకపోవటమే కాదు.. స్టాలిన్ కూడా ఈ తరహా రాజకీయాలకు ఇప్పటికిప్పుడు తెర తీయరనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/