Begin typing your search above and press return to search.

చిన్నమ్మ.. పన్నీర్ లు ఓడి గెలిచారా?

By:  Tupaki Desk   |   16 Feb 2017 8:21 AM GMT
చిన్నమ్మ.. పన్నీర్ లు ఓడి గెలిచారా?
X
ఎప్పుడూ వినే సామెతె. మరోసారి నిజమైంది. అమ్మ నెచ్చెలి చిన్నమ్మ.. అమ్మ విధేయుడు పన్నీర్ మధ్య జరిగిన యుద్ధంలో సీఎం పదవి ఇరువురికి కాకుండా పోవటం గమనార్హం. అంతేకాదు.. వీరి పోరు అనుకోని పరిణామాల్ని తెర మీదకు తీసుకొచ్చేలా చేయటంతో పాటు.. ఇద్దరికి షాకుల మీద షాకులు తగిలాయని చెప్పాలి.

అమ్మ మరణం తర్వాత ఆమెకు అత్యంత విధేయుడైన పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన శశికళ అండ్ కో.. కొద్దిరోజులకే ఆ పదవిలో తాను కూర్చుంటే చక్రం మొత్తం తానే తిప్పొచ్చని ఫీలయ్యారు. అంతే.. తర్వాతి కథ తెలిసిందే. ఇరువురి మధ్య నడిచిన పోరులో.. సీఎం కుర్చీ ఇద్దరికి కాకుండా పోయి.. ఎంతకూ సంబంధం లేని ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్) చేతికి వెళ్లిపోయింది.

ఈ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే ఆసక్తికర అంశాలు చాలానే కనిపిస్తాయి. అమ్మకు అత్యంత సన్నిహితులైన ఈ ఇద్దరి మధ్య జరిగిన వార్ లో ఇద్దరూ ఓడిపోవటమే కాదు.. ఇద్దరు గెలవటం కూడా కనిపిస్తుంది.అంతేకాదు.. దేని కోసమే ఇంత రార్ధాంతం జరిగిందో.. అది ఇద్దరికి చెందకుండా మూడో వ్యక్తికి పోవటం మరో విశేషంగా చెప్పాలి.

ఇరువర్గాలకు జరిగిన వార్ లో ఇరువురికి గెలుపు ఏమిటన్నది చూస్తే.. ఏది ఏమైనా.. ప్రత్యర్థి మాత్రం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోకూడదన్న విషయంలో ఇరువురు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక.. ఇరువురి ఓటమి విషయానికి వస్తే.. సీఎం కుర్చీ ఆశపడటంతో.. రాజభోగాలు అనుభవిస్తూ.. పాలకపార్టీ చీఫ్ గా సీఎం కాకుండా సీఎంకి రిమోట్ గా వ్యవహరించే అవకాశాన్ని మిస్ అయ్యారు.

పన్నీర్ విషయానికి వస్తే.. చిన్నమ్మపై తిరుగుబాటు చేయకుండా.. ఇంతకాలం ఎలాంటి అవమానాలు పొందారో.. మరికొన్ని తప్పవని ఫిక్స్ అయి ఉంటే.. మళ్లీ ముఖ్యమంత్రి పదవి ఆయన్నే వరించేది. ఒకవేళ.. అలాంటిది జరగకుండా ఉండి ఉంటే..చిన్నమ్మ జైలుకు వెళ్లేటప్పుడు విధేయుడైన పన్నీర్ ను కాకుండా వేరే వారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టం ఏమిటన్న సానుభూతి జనాల్లో ఉండది. ఏది ఏమైనా ఒకరి మీద ఒకరు చేసుకున్న యుద్ధంలో శశికళ.. పన్నీర్ లు ఇద్దరూ భారీగా నష్టపోయారనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/