Begin typing your search above and press return to search.
ఆయనిప్పుడు పన్నీర్ కాదు కబాలి సెల్వమట..
By: Tupaki Desk | 10 Feb 2017 10:30 AM GMTకబాలీ సినిమాలో రజనీకాంత్ పాపులర్ డైలాగ్ తెలుసుగా.. దానికి ఎన్ని స్పూఫ్ లు వచ్చినా ఇంకా మజాగానే అనిపిస్తుంటాయి. తాజాగా తమిళనాడు రాజకీయాలపై దీనికి స్పూఫ్ వచ్చేసింది. రాజీనామా చేసిన సీఎం పన్నీర్ సెల్వంతో చేసిన గ్రాఫికల్ స్పూఫ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తమిళ - తెలుగులో ఈ స్పూఫ్ ఫేస్ బుక్ - వాట్సాప్ లలో దుమ్ము రేపుతోంది.
‘
ముఖం మీద గాటు పెట్టుకొని - మీసాలు మెలి తిప్పి - లుంగీ కట్టుకుని - పాత విలన్ 'ఏయ్ కబాలీ' అనగానే ఒంగొని వినయంగా ఎస్ బాస్..అని నిలబడుతాడే ఆ కబాలీ అనుకున్నార్రా.. కబాలీ రా’ అంటూ సూపర్ స్టార్ రజనీ చెప్పిన ఆ డైలాగ్ ఎంతగా ఆకట్టుకుందో ఇప్పుడు పన్నీర్ డైలాగు కూడా టైమ్లీగా అంతేస్థాయిలో పేలింది.
తమిళంలో పన్నీర్ సెల్వం కబాలీలా అయిపోయారంటూ పన్నీర్ మద్దతుదారులు రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రజనీ వీడియలో రజనీ ఫేస్ ప్లేసులో పన్నీర్ ఫేస్ పెట్టి ఇది చేశారు. అందులో ... ‘‘అమ్మ ఉన్నప్పుడు బొట్టుపెట్టుకుని - గడ్డం గీయించుకుని - లుంగీ దించుకుని ఉన్నాను కదా అని, ఇప్పుడు చిన్నమ్మ వచ్చి రాజీనామా చేయ్ అనగానే ఒంగొని వినయంగా ఎస్ మామ్ అనడానికి పాత సెల్వం అనుకుంటున్నారా? సీఎం సెల్వం రా...’’ అంటూ పన్నీర్ సెల్వం డైలాగుతో ఈ వీడియో ఇప్పుడు తెగ షేర్ అవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/