Begin typing your search above and press return to search.
పన్నీర్ పేపర్లు చదవరా?టీవీ ఛానళ్లు చూడరా?
By: Tupaki Desk | 8 Feb 2017 4:11 AM GMTపెద్దగా మాట్లాడకపోవటం.. ఇచ్చిన పేపర్ మీద రాసి ఉన్న మాటల్ని చదివేసి..మరింకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయే అలవాటు ఉన్న పన్నీర్ సెల్వం మొదటిసారి నోరు విప్పారు. అమ్మ ఏం చెప్పింది? చిన్నమ్మ ఏం చేసిందంటూ ఇంతకాలం గుట్టుగా ఉన్న పలు విషయాల్ని బయటకు చెప్పేశారు. అమ్మ ఆత్మ ఆదేశించటంతో తానీ మాటలు చెబుతున్నట్లుగా చెప్పటం ద్వారా.. సెంటిమెంట్ ను బయటకు లాగటమే కాదు.. అమ్మ తన వైపే ఉన్నట్లుగా చెప్పకనే చెప్పేశారు. జరుగుతున్న పరిణామాలకు తానే కాదు.. అమ్మ ఆత్మ కూడా విపరీతంగా క్షోభిస్తున్నట్లుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఆదివారం ఏం జరిగిందంటే.. అంటూ చిన్నమ్మను శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్న వైనాన్ని.. ఆ సందర్భంగా నాలుగు గోడల మధ్య జరిగిన విషయాల్ని మీడియా ముందు చెప్పేశారు. ఈ సందర్భంగా ఆయన మాటలువింటే కాస్తంత విస్మయానికి గురి కావటం ఖాయం. ఎందుకలా అనేది చెప్పటానికి ముందు.. ఆదివారం ఎపిసోడ్ గురించి పన్నీర్ నోటి నుంచి వచ్చిన మాటల్నిమొదట చూస్తే.. ‘‘ఆదివారం నన్ను పోయెస్ గార్డెన్ కు రమ్మని పిలిచారు. అక్కడ సీనియర్ నాయకులు.. శాసనసభ్యులు.. మంత్రులు.. శశికళ కుటుంబ సభ్యులున్నారు. ఆ సమావేశం గురించే నాకు ముందుగా తెలియదు. అక్కడకు వెళ్లాక నన్నురాజీనామా చేయాలని శశికళ చెప్పారు. తాను సీఎం కావాలంటే అలా చేయక తప్పదన్నారు. ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏముందని అడిగా. పార్ట ప్రధాన కార్యదర్శిగా.. సీఎంగా ఒకే వ్యక్తి ఉండాలని చెప్పారు. చిన్నమ్మను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న విషయాన్ని చెప్పటంతో దిగ్ర్భాంతికి గురయ్యా. రెండు గంటలు ఆమెతో వాదించా. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న నన్ను రాజీనామా చేయాలనటం సరైనదేనా? అని అడిగా’’ అని చెప్పారు.
ఆయన చెప్పిన మాటల్ని ఇక్కడితో కట్ చేసి.. వాస్తవంలోకి వెళితే.. శుక్రవారం నుంచే పన్నీర్ సెల్వంను తప్పించేందుకు చిన్నమ్మ పావులు కదుపుతున్నట్లుగా వార్తలు రావటం మొదలయ్యాయని మర్చిపోకూడదు. శనివారం నాటికి ఆతరహా వార్తల తీవ్రత మరింత ఎక్కువైంది. ఆదివారం ఉదయం 11 గంటలవరకూ సీఎంగా చిన్నమ్మను ఎన్నుకుంటారని.. పన్నీర్ ను తొలగిస్తారన్న మాట ఛానళ్లలో జోరుగా సాగింది. పన్నెండు గంటల సమయంలో.. శాసనసభాపక్ష సమావేశం కేవలం పార్టీ వ్యూహాల మీదనే అని చెప్పినప్పటికీ.. కాసేపటికే చిన్నమ్మను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు.. పన్నీర్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చేశాయి.
చిన్నమ్మ కదుపుతున్న పావుల గురించి మీడియాకు శుక్రవారమే తెలిసి.. జోరుగా ప్రచారం సాగించినప్పుడు.. సీఎంగాఉన్న పన్నీరు సెల్వంకు ఆ మాత్రం ముచ్చటతెలియకపోవటం ఏమిటి? నిఘా వర్గాలు ఆయనకు అనుకూలంగా లేవనే అనుకుందాం. కానీ.. పేపర్లు.. స్విచ్ ఆన్ చేస్తే వచ్చే టీవీ ఛానళ్లలో వార్తలు ఆయన చూడలేదా?అన్నది ఒక ప్రశ్న. ఇంతకాలం అచ్చేసిన స్క్రిప్ట్ ను మాత్రమేచదివే అలవాటున్న పన్నీర్ కు.. అందుకు భిన్నంగా మాట్లాడటం వల్లనే కాబోలు..‘ఆదివారం నన్ను పిలిచే వరకూ ఈ సమావేశం గురించి తెలీదు’ అన్న మాటవచ్చి ఉంటుంది. కీలక సమయాల్లో తాను మాట్లాడే ప్రతి మాటను కోట్లాది మందినిశితంగా పరిశీలిస్తారన్న విషయాన్ని పన్నీర్ గుర్తుంచుకుంటే మంచిదేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/