Begin typing your search above and press return to search.
పన్నీర్ కు సీఎం పీఠం..పళనిసామి రెడీ
By: Tupaki Desk | 22 April 2017 11:08 AM GMTతమిళనాడులో ఏఐఏడీఎంకే రెండు వర్గాల మధ్య విలీన ప్రతిపాదనకు ముందడుగులు పడుతున్నాయి. చర్చల ప్రక్రియకోసం అధికార ఏఐఏడీఎంకే (అమ్మ) వర్గం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ వైథిలింగం నేతృత్వంలో కమిటీని ప్రకటించగా, పన్నీర్ సెల్వం వర్గం కూడా మాజీ మంత్రి కేపీ మునుస్వామి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైథిలింగం కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక పరిపాలన మంత్రి ఎస్పీ వేలుమణి చెప్పారు.
మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం గొంతెమ్మ కోరికలతో విలీనంపై బెట్టు చేసినా సీఎం పళనిసామి తన ప్రయత్నాలు మానుకోలేదు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉండాలని, అందుకు ఒక మెట్టుదిగడానికైనా తాను సిద్దంగా ఉన్నానని ముఖ్యమంత్రి పళనిసామి తన మంత్రి వర్గ సభ్యులతో అన్నారని సమాచారం. చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎడప్పాడి పళనిసామి తన మంత్రి వర్గంతో, అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో ముమ్మరంగా మంతనాలు జరుపుతున్న సందర్భంగా ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. మన అభివృద్దికి కారణం అయిన పార్టీని కాపాడుకునేందుకు మొహమాటం లేకుండా పన్నీర్ సెల్వం వర్గంతో రాజీకావడానికి తాము సిద్దంగా ఉన్నామని మెజారిటీ ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామికి హామీ ఇచ్చారని తెలిసింది. సీఎం పళనిసామి ప్రకటన నేపథ్యంలో మెజార్టీ మంత్రులు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా... పార్టీ చిహ్నం రెండాకుల గుర్తు తమకే కావాలని ఇదివరలో కోరిన రెండువర్గాలు అందుకు తగిన ఆధార పత్రాలను జూన్ 16లోగా సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. విభేదాలు వీడి విలీనానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రెండు వర్గాలు.. తమ సంఖ్యాబలం, ఇతర ఆధారాలను చూపించడానికి మరో ఎనిమిది వారాల గడువు కావాలని కోరాయని, దాంతో జూన్ 16 వరకు గడువిచ్చినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/