Begin typing your search above and press return to search.
సెల్వంకు పెరుగుతున్న బలం...మరో ఎంపీ మద్దతు
By: Tupaki Desk | 11 Feb 2017 6:00 PM GMTతమిళ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన ఉత్కంఠతో సాగుతున్నాయి. ఆ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఊహించని రీతిలో మద్దతు పెరుగుతోంది. తాజాగా తిర్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం సభ్యురాలు సత్యభామ తన మద్దతు తెలిపారు. పన్నీర్ సెల్వం నివాసానికి వచ్చిన సత్యభామ తన మద్దతు ప్రకటించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... తాను తన సంపూర్ణ మద్దతును పన్నీర్ సెల్వంకు ఇస్తున్నట్టు ప్రకటించారు. పార్టీని ఐక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఏ శక్తులు ఏఐఏడీఎంకేను విడదీయలేదని తెలిపారు. పన్నీరు సెల్వం మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా పరిణామాల ప్రకారం పన్నీర్ సెల్వం మద్దతు దారుల సంఖ్య క్రమంగా పెరుగుతూపోతుంది. విద్యాశాఖ మంత్రి పాండ్యన్ ఇప్పటికే సెల్వంకు మద్దతు ప్రకటించగా తాజాగా పార్టీ కోశాధికారి దిండిగల్ శ్రీనివాసన్ సెల్వం వైపు వచ్చేశారు. శశికళ ఇటీవలే పన్నీర్ స్థానంలో శ్రీనివాసన్‌ను పార్టీ కోశాధికారిగా నియమించారు. ఇదిలాఉండగా.... తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఇవాళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ రాశారు. ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చే అవకాశం తనకు ఇవ్వాలంటూ ఆమె లేఖలో అభ్యర్థించారు. సీఎం పన్నీరు సెల్వం రాజీనామాను ఆమోదించి ఏడు రోజులు అవుతున్నది, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. తమిళనాడు శ్రేయస్సు దృష్ట్యా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆమె లేఖలో గవర్నర్‌ను కోరారు. తనకు మెజారిటీ ఉందని, తాను సీఎంగా ప్రమాణం స్వీకారం చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె లేఖలో అభ్యర్థించారు. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు తనను శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్న విషయాన్ని కూడా ఆమె ఆ లేఖలో గుర్తు చేశారు. అయితే శశికళ అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతే తమిళనాడు ప్రతిష్టంభనపై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.