Begin typing your search above and press return to search.

పన్నీరు సెల్వానికి మోడీ చెప్పిన మాట ఇదేనా?

By:  Tupaki Desk   |   19 Jan 2017 8:06 AM GMT
పన్నీరు సెల్వానికి మోడీ చెప్పిన మాట ఇదేనా?
X
యావత్ తమిళనాడు మొత్తం జల్లికట్టు నిషేధం మీద తీవ్రంగా విరుచుకుపడుతూ.. వరుస ఆందోళనలు.. నిరసనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జల్లి కట్టు మీద విధించిన నిషేధాన్ని ఎత్తేయాలంటూ సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. జల్లికట్టు తమ సంప్రదాయమని.. తమ సంస్కృతిని దెబ్బ తీసేలా నిర్ణయాలు తీసుకోవటంపై వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర నిన్నటి నుంచి ఇప్పటివరకూ నాన్ స్టాప్ గా నిరసనలు నిర్వహిస్తున్న తమిళులు.. అంతకంతకూ తమ ఆందోళనల్ని.. నిరసనల్నిపెంచుతున్నారు. జల్లికట్టు మీద విధించిన బ్యాన్ ను ఎత్తేసే వరకూ మెరీనా బీచ్ దగ్గర తమ ఆందోళనల్ని కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని మోడీ వద్దకు వెళ్లారు. ఎంపీలతో కలిసి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరించి.. జల్లికట్టు నిషేధాన్ని ఎత్తివేసేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. దీనిపై ప్రధాని మోడీ ఆచితూచి స్పందించినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు సంస్కృతి మీద ప్రధానికి విపరీతమైన గౌరవం ఉందని.. జల్లికట్టు అంశంపై కమిటీ వేస్తారని.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికకు తగ్గట్లుగా నిర్ణయం తీసుకుంటారని చెప్పినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో.. కేంద్రం ఏమీ చేయలేదన్న విషయాన్ని తన మాటలతో ప్రధాని చెప్పకనే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాలతో.. ఇప్పటికప్పుడు జల్లికట్టు మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/