Begin typing your search above and press return to search.
ఒబామా కపుల్ రొమాన్స్ కు సీక్రెట్ ఏజెంట్లు పరుగులు తీసేవారట
By: Tupaki Desk | 26 Dec 2022 4:27 AM GMTపెళ్లి మీదా.. పెళ్లాం మీద ఉండే జోకులు అన్ని ఇన్ని కావు. పెళ్లాం అన్నంతనే మగాడి ప్రైవసీ మొత్తాన్ని కాల్చుకు తినే వ్యక్తిగా భార్యను చూపిస్తారు. కానీ.. అదే భార్య తన వాళ్లందరిని వదిలేసి వచ్చిందన్న చిన్న విషయాన్ని మర్చిపోతారు. తన ప్రపంచాన్ని వదిలేసి.. పెళ్లి.. భర్త అన్న ట్యాగ్ కోసం తనకు సంబంధం లేని ప్రపంచంలోకి అడుగు పెట్టే అమ్మాయి.. అబ్బాయి నుంచి కాస్తంత ఎక్కువ ఆశిస్తే తప్పేముంది? ఈ విషయాన్ని అర్థం చేసుకునే వారి సంసారం ఎంత సుఖంగా.. ప్రశాంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సామాన్యుల సంగతి ఇలా ఉంటే.. అత్యంత కీలక స్థానాల్లో ఉండే దంపతుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? అన్నది ప్రశ్నే. ఎందుకంటే.. అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారికి ఎదురయ్యే ఆకర్షణలు అన్ని ఇన్ని కావు. వాటిని పట్టించుకోకుండా భార్యభర్తలుగా తొలినాటి ప్రేమను ఏ మాత్రం తగ్గించుకోకుండా.. అంతకంతకూ ఎక్కువయ్యేలా ప్రేమను పెంచుకోవటం అంత తేలికైన విషయం కాదు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తమ 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చిన వివరాలు ఆసక్తికరంగానే కాదు.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీరేనేమో అన్న భావన కలిగేలా చేస్తుంది.
తాజాగా ఈ దంపతులు కెల్లి క్లర్క్ సన్ షోకు హాజరయ్యారు. తమ వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చారు. అన్నింటికి మించి ఈ ఏడాది అక్టోబరులో చేసుకున్న 30వ మ్యారేజ్ యానివర్సిరీ గురించి చెప్పుకొస్తూ.. ఆ రోజున తాము చేసిన పనుల గురించి చెప్పినప్పుడు.. వారి రొమాంటిక్ థాట్ కు ఆసూయ చెందటం ఖాయం. అమెరికా అధ్యక్షుడున్న కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్నా.. వ్యక్తిగత జీవితానికి.. కుటుంబానికి ఒబామా కేటాయించే సమయం గురించి తెలిసిందే.
ఎన్ని పనులు ఉన్నా.. అంతటి బిజీలోనూ భార్యా.. పిల్లలతో కలిసి ఉండటానికి ఆయన పడే తపన అంతా ఇంతా కాదు. ఇదే విషయం ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వేళలో చాలాసార్లుఫ్రూవ్ అయ్యింది. ఈ అక్టోబరులో వారు తమ 30వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు వీలుగా హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా కారును రెంట్ కు తీసుకొని.. కాలిఫోర్నియా పశ్చిమ తీరానికి వెళ్లారు. ఈసారి హనీమూన్ గతం కంటే భిన్నంగా.. కొత్తగా ఉందని చెప్పటం గమనార్హం.
తొలిసారి తాము ఎంతో ఏకాంతంగా ఉన్నట్లుగా అనిపించిందని.. తమకు దూరం నుంచి పహరా కాసే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు తమ రొమాన్సు దెబ్బకు దూరంగా పారిపోయేవారన్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు చాలా సరదాగా.. చిలిపిగా సాగినట్లుగా ఈ దంపతులు పేర్కొన్నారు. తమ అనుభూతుల్ని సరదాగా పంచుకున్న ఆమెకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఒబామా రియాక్టు కావటం గమనార్హం.
సరిగ్గా 30 ఏళ్ల క్రితం (అక్టోబరు 4, 1992) తన వివాహ బంధం మొదలైందని పేర్కొన్న ఒబామా.. సోషల్ మీడియాలో ఒక స్వీట్ పోస్టు పెట్టారు. తన భార్య మిచెల్ పై తనకున్న ప్రేమాభిమానాల్ని అక్షరాల్లో పొదిగేశారు. ''30 ఏళ్ల తర్వాత కూడా నువ్వు అప్పటిలానే ఎందుకు ఉన్నావు? ఆ రోజు నేను లాటరీ గెలుచుకున్నానని తెలుసు. ఇంతకుమించిన లైఫ్ పార్టనర్ ను కోరుకోలేదు. మ్యారేజ్ యానివర్సరీ స్వీట్ హార్ట్'' అంటూ తనకున్న ప్రేమ మొత్తాన్ని కుమ్మరించారు. నిజంగానే స్వీట్ కదూ వీరి దాంపత్య జీవితం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.