Begin typing your search above and press return to search.
ఒబామా..ఎంత ఆలస్యంగా నోరు తెరిచావ్?
By: Tupaki Desk | 8 Oct 2015 6:05 AM GMTప్రపంచ పెద్దన్న అమెరికా చర్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాపీగా నోరువిప్పారు. ఆ విధంగా జరిగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే...ఆఫ్ఘానిస్థాన్ లో ఓ ఆస్పత్రిపై అమెరికా దళాలు దాడిచేశాయి. ఈ ఘటనలో కనీసం 22 మంది మరణించారు. అల్ ఖైదా తీవ్రవాదులు సహా ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులను ముట్టుబెట్టేందుకు అమెరికా దళాలు చేసిన వైమానిక దాడుల్లో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. దీంతో ఒబామా స్పందించారు.
పొరపాటున ఈ దాడి జరిగిందని, క్షమించాలని ఒబామా కోరారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని, మిలటరీ చర్యలను పర్యవేక్షిస్తామని చెప్పారు. ఆఫ్ఘాన్ లో సేవలు అందిస్తున్న 'డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్' సంస్థ ప్రతినిధులతో ఒబామా ఫోన్ లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలను ప్రపంచ సమాజం ఆహ్వానిస్తున్నప్పటికీ పలు సందర్భాల్లో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతున్నాయి. ఐఎస్ ఐఎస్ రాక్షసత్వం సహించరానిదని, అల్ ఖైదా చేస్తున్న ఉగ్రవాద చర్యలు తీవ్రమైనవే. కానీ...అమెరికా దళాల దాడులు కూడా సరైనవి కాదేమో.