Begin typing your search above and press return to search.

ఒబామా అధ్యక్షుడి హోదాలో మోడీకి చివరిసారి!

By:  Tupaki Desk   |   19 Jan 2017 8:08 AM GMT
ఒబామా అధ్యక్షుడి హోదాలో మోడీకి చివరిసారి!
X
ఒకే ఒక్క రోజు... అమెరికా అధ్యక్షుడి హోదాలో బరక్ ఒబామా కు మిగిలిన సమయం. ఈ ఒక్క రోజునీ ఒబామా ఎలా గడుపుతున్నారు, ఏమేమి పనులు చేస్తున్నారు అనే విషయాల్లో కొన్ని విషయాలను తాజాగా వెల్లడించింది వైట్ హౌస్. ఈ కార్యక్రమాల్లో ఒకటి... భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఒబామా అధ్యక్షుడి హోదాలో చివరిసారి ఫోన్ చేయడం!

అవును... ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి బ‌రాక్ ఒబామా ఫోన్‌ చేశారు. ప్ర‌ధానంగా ర‌క్ష‌ణ రంగం, పౌర అణు ఇంధ‌నం, ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌డం వంటి విష‌యాల గురించి మాట్లాడారు. 2015లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు త‌న‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఒబామా గుర్తుచేసుకున్నారు. త్వ‌ర‌లో 68వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మోడీకి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. అమెరికాకు ప్ర‌ధాన ర‌క్ష‌ణ భాగ‌స్వామిగా భార‌త్‌ను గుర్తించ‌డంతోపాటు ఆర్థిక‌, ర‌క్ష‌ణ రంగాల‌కు సంబంధించి ప్రాథ‌మ్యాలు, వాతావ‌ర‌ణ మార్పుల‌ను భ‌విష్య‌త్తులో ఎలా ఎదుర్కోవాలి త‌దిత‌ర అంశాల‌పై ఇద్ద‌రు నేత‌లూ చ‌ర్చించుకున్నారని వైట్ హౌస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాగా, 2014 మే లో ప్ర‌ధాన‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంటనే న‌రేంద్ర‌మోడీకి ఫోన్ చేసి అభినందించిన విదేశీ నేతల్లో బ‌రాక్ ఒబామా ఒకరు. అంతేకాదు, మోడీని వైట్‌ హౌస్‌ కు రావాల్సిందిగా కూడా ఆహ్వానించారాయ‌న‌. మొట్ట‌మొద‌టిసారిగా వీళ్లిద్ద‌రూ 2014 సెప్టెంబ‌రులో వైట్‌ హౌస్‌ లో క‌లిశారు. ఆ త‌ర‌వాత ఇప్ప‌టివ‌ర‌కూ 8సార్లు స‌మావేశ‌మ‌య్యారు. అమెరికా అధ్య‌క్షుడు, భార‌త ప్ర‌ధాని... వాళ్ల ప‌ద‌వీకాలంలో ఇన్నిసార్లు స‌మావేశం కావ‌డం ఒక రికార్డే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/