Begin typing your search above and press return to search.
ఒబామా మనల్ని ఎందుకు అవమానించాడు?
By: Tupaki Desk | 19 March 2016 6:14 AM GMTఅమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలంబియా జిల్లా అప్పీల్స్ కోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాసన్ ఎంపికయ్యే అవకాశం-- దాదాపు గత నెలరోజులుగా ఈ వార్త భారతీయుల సంతోషానికి కారణమైంది. ప్రపంచ పెద్దన్న దేశంలో అత్యున్నత న్యాయమూర్తిగా భారతీయుడికి అవకాశం దక్కే అవకాశం ఉండటం మన గౌరవంగా అంతా భావించారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మెరిక్ గార్లెండ్ ఎంపికయ్యారు. భారతీయ అమెరికన్ కు వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం వెనుక కారణం ఏంటనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.
మితవాదపక్షానికి చెందిన ప్రముఖుడు - సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా గతనెలలో ఆకస్మికంగా మృతిచెందిన నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని నియమించాల్సి వచ్చింది. ఒబామా అధ్యక్ష పదవీకాలంలో అనేక మంది భారతీయ అమెరికన్లకు పలు న్యాయస్థానాల్లో అవకాశం కల్పించారు. దీంతో, శ్రీ శ్రీనివాసన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కావడం ఖాయమనే ఊహాగానాలు వినిపించాయి. ఆధునిక భావాలున్న వ్యక్తిగా పేరున్న 48 ఏండ్ల శ్రీనివాసన్ కు డెమోక్రట్లు - రిపబ్లికన్ల మద్దతుండటంతో ఆయనను న్యాయమూర్తిగా ఎంపిక చేస్తారన్న వాదనలు బలంగా వినిపించాయి. అయితే ఈ ఊహాగాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా తెరదించారు.
న్యాయమూర్తులకు నిర్వహించిన ఇంటర్వ్యూ చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగిన అనంతరం వాషింగ్టన్ డీసీ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న 63 ఏండ్ల మెరిక్ గార్లాండ్ పేరును ఒబామా ప్రతిపాదించారు. దేశంలోని అతిగొప్ప న్యాయనిపుణుల్లో ఒకరిగా ఆయనను అభివర్ణించి రాజకీయాలను పక్కనపెట్టి సెనేట్ లో మెజారిటీగా ఉన్న రిపబ్లికన్లు తన ఎంపికకు మద్దతివ్వాలని కోరారు.
అయితే రిపబ్లికన్ల నుంచి ఒబామా నిర్ణయానికి ప్రతికూల స్పందన వచ్చింది. పదవీకాలం మరో ఏడాది కూడా లేని సమయంలో కీలకమైన నియామకాలను అధ్యక్షుడు చేపట్టరాదని... తాము ఈ ఎంపికను సమర్థించబోమని రిపబ్లికన్ సెనేటర్ జాన్ మెక్ కన్నెల్ స్పష్టం చేశారు. ఇక శ్రీనివాసన్ విషయానికి వస్తే ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా రాజకీయ వాతావరణం వేడెక్కి ఉండటంతో...న్యాయమూర్తి ఎంపికపై మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదేమోనన్న భావనతో ఒబామా వెనక్కుతగ్గారని సమాచారం. దీంతోపాటు రాజకీయ పరిణామాల కారణంగానే స్కోటస్ (అమెరికా సుప్రీం కోర్టు) ప్రక్రియ భిన్నంగా జరిగి ఉంటోందని తెలుస్తోంది.
కొలంబియా అప్పీల్స్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న శ్రీ శ్రీనివాసన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు పలువురు భారతీయ అమెరికన్లు ప్రకటించారు. అయితే, న్యాయమూర్తుల జాబితాలో శ్రీ శ్రీనివాసన్ పేరును ప్రతిపాదించడాన్ని సమర్థిస్తున్నట్టు వారు తెలిపారు. ఒబామా తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి చెందినట్టు ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ - భారత సంతతి అటార్నీ రవి బాత్రా - హిందూ అమెరికన్ ఫౌండేషన్ సభ్యులు సుహాగ్ శుక్లా - సల్దేఫ్ లు అసంతృప్తి వ్యక్తం చేశారు.