Begin typing your search above and press return to search.

ఈ విషయంలో ఒబామాది పెద్ద మనసు!

By:  Tupaki Desk   |   21 Dec 2016 5:05 AM GMT
ఈ విషయంలో ఒబామాది పెద్ద మనసు!
X
భారతదేశంలో భారీ నేరాలకు పాల్పడిన వారికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టే సంగతి తెలిసిందే. దేశాధ్యక్షులకు ఉన్న ఈ ప్రత్యేక అధికారానికి పనిచెప్పారు అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామా. పదవీకాలం ముగుస్తున్న తరుణంలో భారీ ఎత్తున క్షమాగుణం ప్రదర్శించారు. అధ్యక్షుడైనప్పటి నుంచీ ఈ విషయంలో కాస్త మనసుపెట్టి ఆలోచిస్తున్న ఒబామా తాజాగా సుమారు 78 మందిని క్షమించారు. ఇదే క్రమంలో మరో 153 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. దీంతో ఇంతమందికి ఈ స్థాయిలో క్షమాభిక్ష పెట్టడం గతంలో ఏ అధ్యక్షుడు చేయలేదని వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి.

ఓటు వేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం, పదవులకు అర్హత కల్పించడం సహా న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అర్హత పొందటం వంటివి ఈ క్షమాబిక్ష అధికారంలో అధ్యక్షుడు ప్రత్యేకంగా కలిగి ఉంటారు. దీంతో క్షమాభిక్షలపై గత కొన్ని నెలలు ఒబామా వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే వీటిల్లో శిక్ష తగ్గించేవే ఎక్కువగా ఉంటున్నాయట. అయితే వీరిలో.. నకిలీ కరెన్సీ మార్పిడి, అనుకోకుండా జరిగిన మారణకాండలో పాల్గొన్నవారు, పేలుడు పదార్థాలతో దొరికినవారు ఎక్కువమంది ఉన్నారు. అయితే తాజా క్షమాపణలతో... అధ్యక్షుడిగా ఒబామా ఇప్పటి వరకూ 148 మందికి క్షమాభిక్ష పెట్టినట్లవగా, 1176 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. ఈ మేరకు వైట్‌ హౌస్‌ న్యాయవాది నీల్‌ ఎగ్గెల్‌ స్టన్‌ ఈ వివరాలను తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/