Begin typing your search above and press return to search.
ఒబామాకు మరింత దగ్గరైన మోడీ
By: Tupaki Desk | 24 Dec 2015 9:36 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోడీకి అంతర్జాతీయ ర్యాంకింగ్ లో మరోమారు టాప్ టెన్ లో నిలిచారు. ఓఆర్ బీ ఇంటర్నేషనల్స్ అనే సంస్థ ‘ఇంటర్నేషనల్ వరల్డ్ లీడర్స్’ సర్వే నిర్వహించింది. వరల్డ్ వైడ్ మోస్ట్ పాపులర్ లీడర్ గా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫస్ట్ ప్లేస్ లోనిలిచారు. ఈ సర్వేలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఏడో స్థానంలో నిలిచారు. ఒబామా తర్వాత స్థానాల్లో జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ - బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కేమెరూన్ లు నిలిచారు.
మొత్తం 65దేశాల్లో ఈ సర్వే చేపట్టగా.. ప్రధాని మోడీకి అనుకూలంగా 24శాతం మంది ప్రజలు ఓటు వేశారు. మరో 20శాతం మంది మోడీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా 30శాతం ఓట్లు సాధించారు. ఒబామాకు అనుకూలంగా 59శాతం మంది ప్రజలు ఓట్లు వేయగా.. వ్యతిరేకంగా 29శాతం మంది ప్రజలు ఓటు వేశారు. చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈయనకు అనుకూలంగా 30శాతం మంది ఓట్లు వేశారు.
2015 ఏడాది ముగుస్తున్న సందర్భంగా ఓఆర్ బీ ఇంటర్నేషనల్స్ ఈ సర్వేను నిర్వహించింది. ఫోర్బ్స్ వంటి పలు అంతర్జాతీయ సర్వేల్లోనూ మోడీ టాప్‌టెన్‌లో నిలిచి తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే టైమ్ వంటి ప్రఖ్యాత మేగజైన్ నిర్వహించిన సర్వేలో మోడీ టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు.