Begin typing your search above and press return to search.

అమెరికా ఎప్పటికి బలహీనపడదు ... ట్రంప్ ఓటమిని అంగీకరించాలి: ఒబామా

By:  Tupaki Desk   |   16 Nov 2020 5:10 PM GMT
అమెరికా ఎప్పటికి బలహీనపడదు ...  ట్రంప్ ఓటమిని అంగీకరించాలి: ఒబామా
X
అగ్రరాజ్యం అమెరికా లో తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ , ట్రంప్ పై ఘనవిజయం సాధించాడు. అయితే , ట్రంప్ మాత్రమే ఓటమిని అంగీకరించలేదు. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇలా ప్రవర్తించలేదు. రిగ్గింగ్ చేసి జో బైడెన్ గెలిచాడు అంటూ ఆరోపణలు చేస్తున్నాడు. అయితే చాలామంది జో బైడెన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ట్రంప్ తన ఓటమిని అంగీకరించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఫలితాలు వెలువడిన రోజు కానీ, మళ్లీ రెండు రోజులకి కానీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించి ఉంటే బాగుండేదని అన్నారు.

అధ్యక్ష ఫలితాల్లో వచ్చిన నంబర్లను చూస్తే... జో బైడెన్ అధ్యక్షుడు కావడానికి కావాల్సినంత మెజార్టీని సాధించారని తెలిపారు. ట్రంప్ తన అహం తగ్గించుకొని , బైడెన్ కు అధికార పగ్గాలను అప్పగించాలని , దేశాధ్యక్షుడు అంటే ఒక ప్రజా సేవకుడని, కొంత కాలం మాత్రమే అధ్యక్షుడి కార్యాలయంలో ఉంటారని, అది పర్మినెంట్ పోస్ట్ కాదని, వచ్చిన మార్పులకి అనుకూలంగా సాగిపోతుండాలని అన్నారు. ఈ ఎన్నికల్లో దేశం రెండు భాగాలుగా విడిపోయిందని , అమెరికా సంయుక్త రాష్టాలుగానే మన దేశ విదేశాంగ విధానాలు ఉంటాయని, అమెరికా అసంయుక్త రాష్ట్రాలుగా విధానాలు ఉండవని చెప్పారు. డెమొక్రాట్లలో కానీ, రిపబ్లికన్లలో కాని ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ను తాను ఎన్నడూ చూడలేదని అన్నారు.

అయన వ్యవస్థలను దెబ్బతీశారని చెప్పారు. ప్రస్తుత స్థితిలో ఉన్న ఓ ప్రజాస్వామ్య దేశాన్ని ముందుకు నడపడం ఆషామాషీ కాదని అన్నారు. నియమ, నిబంధనలను బేఖాతరు చేసే వ్యక్తి చేతిలో అధికారం ఎంతో కాలం ఉండదు అంటూ గట్టిగా చెప్పాడు. అమెరికా బలహీనపడిందని ప్రత్యర్థి దేశాలు భావిస్తున్నాయని... కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి కారణమని ఒబామా అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా మరొక కారణమని చెప్పారు. ఇవన్నీ చూసిన ప్రత్యర్థులు అమెరికాను కొల్లగొట్టడం సాధ్యమేననే నిర్ణయానికి వచ్చాయని , కానీ, అమెరికా ఎప్పటికి దృఢమైన దేశం అని , అమెరికాను కొల్లగొట్టడం సాద్య పడదు అంటూ గట్టిగా చెప్పారు.