Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ అనుభవాలు పంచుకున్న ఒబామా .. కూతురి బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టంలేదట ?

By:  Tupaki Desk   |   21 Dec 2020 11:30 PM GMT
లాక్ డౌన్ అనుభవాలు పంచుకున్న ఒబామా .. కూతురి బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టంలేదట ?
X
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏ ప్రామిస్డ్‌ లాండ్ అనే పేరు తో ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఆ పుస్తకం లో ఎన్నో కొత్త కొత్త విషయాలని పొందుపరిచారు. అలాగే ఒబామా జీవితంలో కీలక ఘట్టాలని అందులో పొందుపరిచారు. ఆ బుక్ ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రతి రోజు ఎదో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంటూ .. తన పుస్తకాన్ని ప్రోమోట్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లాక్ ‌డౌన్‌ సమయంలో ఫ్యామిలీతో కలిసి హోం క్వారెంటైన్ ‌లో గడిపిన అనుభవాలను పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. చాలా కుటుంబాల్లోలానే మేము కూడా ఓ నెల ఆటలు ఆడుకుంటూ, చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుంటూ సరదాగా గడిపాము. మాలియా బాయ్‌ఫ్రెండ్‌ కూడా మాతో ఉన్నాడు. రాత్రి పూట కూడా ఆటలు ఆడుకునేవాళ్లం. కొద్దిరోజులకే వారు బోర్‌గా ఫీలయ్యారు. అప్పుడప్పుడు మాలియా, సాశ, మాలియా బాయ్‌ఫ్రెండ్‌ కు కార్డ్సు కూడా నేర్పించాను. మాలియా బాయ్‌ ఫ్రెండ్‌ బ్రిటీష్‌ వ్యక్తి. ఉద్యోగం చేస్తున్నాడు. మా కుటుంబంలోకి అతడ్ని ఆహ్వానించాము. మొదట నాకతడు నచ్చలేదు. కానీ, చాలా మంచి వ్యక్తి. మగపిల్లల తిండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి వల్ల మా ఇంటి నిత్యావసరాల ఖర్చు 30 శాతం పెరిగింది అని అన్నారు. కాగా, ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్’ పుస్తకంలో తన బాల్య స్మృతులను ఒబామా నెమరువేసుకున్నారు. తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
Tags: