Begin typing your search above and press return to search.
రక్తచరిత్ర ఓబుళ రెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డి 25 యేళ్ల కిందటి రేర్ వీడియో!
By: Tupaki Desk | 20 Dec 2019 5:33 AM GMTఅనంతపురం జిల్లాకు చెందిన సానె ఓబుళ రెడ్డి ఫొటోలు - వీడియోలు నెట్ లో దాదాపుగా అందుబాటులో ఉండవు. రక్తచరిత్ర సినిమాలో బుక్కారెడ్డిగా ఆయన పాత్రను రామ్ గోపాల్ వర్మ తన ఇష్టానికి తీశారు. అయితే ఓబుళ రెడ్డి గురించి అవంతా కల్పితాలు అని ఆయనను బాగా ఎరిగిన వారు చెబుతూ ఉంటారు. ఆయనను చంపడానికి ఒక చెడ్డవాడిగా ముద్ర వేసి.. చంపారు.. అని అనంతపురానికే చెందిన కొంతమంది చెబుతూ ఉంటారు.
అప్పటి కాంగ్రెస్ వ్యతిరేక మీడియా - పరిటాల రవి వర్గం ఓబుళ రెడ్డి మీద చెడ్డవాడిగా ముద్ర వేస్తే.. రక్త చరిత్ర సినిమా ఓబుళరెడ్డి గురించి చెడును మరింత గ్లోరిఫై చేసిందని పరిశీలకులు చెబుతూ ఉంటారు. ఆ సంగతలా ఉంటే.. ఇదొక అరుదైన వీడియో.
అప్పట్లో సానె కుటుంబం, జేసీ కుటుంబం బాగా సన్నిహితంగా ఉండేది. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం - పెనుకొండ నియోజకవర్గంలో సానె కుటుంబం రాజకీయం చేస్తున్నప్పటికి సంబంధించిన వీడియో ఇది. హిందూపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఓబుళరెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డిలు ఇలా కనిపించారు. రక్తచరిత్రలో చూపిన బుక్కారెడ్డి పాత్రధారికి - ఓబుళరెడ్డికి మాత్రం పోలిక ఉండదు.
ఇక అప్పటి పరిస్థితులను మాత్రం ఈ వీడియో చక్కగా చూపిస్తుంది. వీళ్ల వెంట ఒక ప్రైవేట్ సైన్యమే కనిపిస్తుంది. వారి చేతుల్లో పొడవాటి తుపాకులు ఉన్నాయి. పంచెలు కట్టుకుని - తుపాకులు చేత పట్టి.. ఫ్యాక్షన్ సినిమాల్లోని సీన్లను తలపిస్తుంది ఈ వీడియో. పాతికేళ్ల కిందటి వీడియో ఇది.