Begin typing your search above and press return to search.
ఇది చిన్న విషయం.. అయినా..చంద్రబాబు తెలుసుకోవాల్సిందే!
By: Tupaki Desk | 20 April 2022 9:38 AM GMTఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి. పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి. ఇదీ.. ఇప్పుడు.. పార్టీఅ ధినేతగా చంద్రబాబు ముందున్న ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలోనే ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తాను ప్రజల మధ్య ఉంటానని.. ప్రజలతో మమేకం అవుతానని.. జిల్లాల్లో పర్యటిస్తానని.. అంటున్నారు. నిజానికి ఇప్పుడు చంద్రబాబు వయసు 72 ఏళ్లు నిండాయి. ఈ వయసులో ఈ నిర్ణయం మంచిదా కాదా.. అనేది పక్కన పెడితే.. అవసరమా? కాదా? అనేదే ముఖ్యం.
ఎందుకంటే.. చంద్రబాబు తన ఇమేజ్ పెంచుకునేందుకు.. పార్టీని గెలిపించుకునేందుకు రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. తను రంగంలోకి దిగితే.. ప్రజలు తన వెంట పార్టీ వెంట నడుస్తారని... ఆయన భావిస్తున్నారు. ఇది నిజమేనా? వాస్తవానికి ఇది సరైన వ్యూహమేనా? అనేది చర్చనీయాంశం. ఎందుకంటే.. ఇమేజ్ లేనివారు.. ప్రజల్లో తిరగాలి. లేదా.. ప్రజల్లో విశ్వసనీయత లేని వారు తిరగాలి. ఈ రెండు కారణాలే.. ప్రజల్లో నాయకులు తిరిగేందుకు ప్రధాన కారణం.
గతంలో వైఎస్ ప్రజల్లో తిరిగారు. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న కుంపట్లను ఆర్పేసి.. తను వెలిగిపోయేందుకు ఇది వ్యూహంగా పనిచేసింది. తర్వాత.. ఆయన కుమారుడు జగన్ ప్రజల్లోకి తిరిగారు.. తనపై ఉన్న కేసులు.. జైలు జీవితం.. ఇలాంటి వాటి నుంచి ప్రజల్లో విశ్వసనీయతను సంపాయించుకునేందుకు ఆయన పాదయాత్ర చేశారు.
కానీ, చంద్రబాబు విషయం అలాకాదు.. ఇప్పటికీ.. పార్టీ ఓడిపోయినా.. చంద్రబాబుపై ప్రజలకు ఉన్న విశ్వాసం.. ఏమాత్రం తగ్గలేదు. విజన్ ఉన్న నాయకుడిగా.. ఆయనకు ఇప్పటికీ.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
సో.. ఇప్పుడు ప్రజలలోకివెళ్లాల్సింది.. పాదయాత్రలైనా.. కారు యాత్రలైనా.. చేయాల్సింది ఆయన కాదు. ప్రజల్లో నానాటికీ విశ్వసనీయతను కోల్పోయిన .. పార్టీ నాయకులే..! గత ఎన్నికల సమయంలోనే.. నాయకులపై విశ్వాసం సన్నగిల్లిందని... చంద్రబాబు కూడా తెలుసు. అందుకే.. ఎన్నికల సమయంలో ఆయన ప్రజలు దండాలు పెట్టారు. అప్పటి నుంచి మూడేళ్లు అయింది. ఇప్పటకైనా పరిస్థితిలో మార్పు వచ్చిందా? అంటే కనిపించడం లేదు. మరో రెండేళ్లలోనే ఎన్నికలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అసలు విశ్వసనీయత కల్పించాల్సిన బాధ్యత.. తమపపై ప్రజలకు నమ్మకం కలిగించా ల్సిన బాధ్యత రేపు ఎన్నికల్లో నిలిచే నాయకులపై ఉంది. సో.. ఆదిశగా చంద్రబాబు వారిని నడిపించిన ప్పుడే... ఆయన భావిస్తున్న లక్ష్యం నెరవేరుతుందని.. పరిశీలకులు చెబుతున్నారు. అంతేతప్ప.. తను మళ్లీ ప్రజల్లోకి వచ్చినా.. కొత్తగా వచ్చే ఇమేజ్ ఏమీ లేదని అంటున్నారు. మరి చంద్రబాబు ఆలోచన చేస్తారో లేదో చూడాలి.