Begin typing your search above and press return to search.

ఉత్తర తెలంగాణలో క్షుద్ర పూజల కలకలం.. వణుకుతున్న జనం..

By:  Tupaki Desk   |   5 Jan 2023 8:54 AM GMT
ఉత్తర తెలంగాణలో క్షుద్ర పూజల కలకలం.. వణుకుతున్న జనం..
X
మంత్రాలకు చింతకాయలు రాలవు.. కానీ మేం రాలిపిస్తాం.. అంటూ కొందరు భయపెడుతున్నారు. క్షుద్రపూజల పేరిట రకరకాల ముగ్గులు, పుర్రెలు పెడుతూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఒక వ్యక్తిని శారీరకంగా దెబ్బ కొట్టలేనప్పుడు అతడిని మానసికంగా కుంగదీసేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు క్షుద్రపూజలు చేస్తూ వారిని లొంగదీసుకుంటారు.దేశం సాంకేతికంగా ఎంతో ముందుకు పోతున్నా.. మూఢనమ్మకాలను నమ్మేవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారిని భయపెట్టేందుకు కొందరు ఇలాంటి వికృత పనులు చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజలు చేయడంతో ఆ ప్రాంత వాసులు వణికిపోతున్నారు. ఇక్కడ మాత్రమే కాకుండా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఇదే సంస్కృతి నెలకొనడంతో సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదని అనుకుంటున్నారు. అయితే జన విజ్ఒన వేదిక నాయకులు మాత్రం ఇలాంటివి నమ్మొద్దని, ఇవి కేవలం ఎదుటి వారిని భయపెట్టేందుకే చేస్తారని అంటున్నారు.

దేవుళ్లను నమ్మేవారు.. దెయ్యాలను కూడా నమ్మాలని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతూ ఉంటారు. అయితే మానసిక ప్రశాంతత కోసం దేవుళ్లను పూజించేవారు.. అదే సమయంలో దెయ్యాలు ఉన్నాయని ప్రశాంతతను చెడగొట్టుకుంటున్నారు. తాము అనుకున్న కొన్ని పనులు ఎలాంటి కాయ కష్టం లేకుండా సాధించుకోవాలని కొందరు ఆధ్యాత్మిక వాదులను సంప్రదిస్తుంటారు. ఇలాంటి వారిని ఆసరాగా చేసుకొని కొందరు క్షుద్రపూజలు చేస్తే ఫలితాలు ఉంటాయని చెబుతారు. క్షుద్రపూజలు చేసేవారు ఉచితంగా ఎవరూ చేయరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు వారు వ్యాపారం కోసమే ఇలాంటివి సృష్టిస్తారని అనుకోవాలి కదా..

అయితే తమను క్షుద్రపూజలు చేయమన్నవారికి అనుగుణంగా నడుచుకోకపోతే ఏం జరుగుతుందోన్న ఆందోళనతోనూ కొందరు వారు చెప్పింది చేస్తారు. ఇలా చాలా మంది లొంగిపోయి.. వారు చెప్పిన విధంగా తమ శత్రువుల ఇళ్ల ముందు.. లేదా ఇతర కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటి సంస్కృతి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో బాగా పాతుకుపోయింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఒకరి ఇంటి ముందు ముగ్గు వేసి, అందులో మనిషి పుర్రెను ఉంచారు. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడే కాకుండా చాలా మంది తమకు శత్రువులుగా ఉన్నవారిని లొంగదీసుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటి మూఢనమ్మకాలకు అస్సలు భయపడొద్దని జన విజ్ఒన వేదిక నాయకులు అంటున్నారు. కేవలం భయపెట్టేందుకు ఇలాంటివి చేస్తుంటారని అంటున్నారు. ప్రతీ పనిని టెక్నాలజీతోనే పనులు చేసుకుంటున్నారని, అలాంటప్పుడు క్షుద్రపూజలను నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు. కొందరు వీటిని చేస్తామన్న వారిని పోలీసులకు పట్టించాలని అంటున్నారు. అయితే క్షుద్రపూజల వ్యవహారం ఎంతో కాలం నుంచి వస్తోంది. ఒకప్పుడు అనాగరికం వల్ల ఇలాంటి వాటికి భయపడాల్సి వచ్చింది. కానీ నేడు ప్రపంచం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తోంది. అందువల్ల వాటిని నమ్మొద్దంటున్నారు.

కానీ కొందరు చదువుకున్న వారు సైతం ఇలాంటి వాటిని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమ వ్యాపారాలు, ఉద్యోగాలు బాగుండాలని క్షుద్రపూజలు చేసేవారిని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మారుమూల ప్రాంతాల్లో ఇలాంటివి మరింత భయంకరంగా ఉంటాయని గ్రామీణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి సంఘటనలు పునారవృతం కాకుండా ఉంటాయని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.