Begin typing your search above and press return to search.

నివురుగప్పిన నిప్పులా 'కన్వేయర్ బెల్ట్'

By:  Tupaki Desk   |   3 Feb 2019 1:30 AM GMT
నివురుగప్పిన నిప్పులా కన్వేయర్ బెల్ట్
X
గ్లోబర్ వార్మింగ్ పట్ల మనిషి తగు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ అంధకారం అవుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూమిని కాపాడుకోవడంతో తన పాత్రను మనిషి విస్మరించాడు. భూమిపై గ్లోబర్ వార్మింగ్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం మనిషే. దీనిపై కన్నెర్ర చేస్తున్న సముద్రుడు తన పనిని తాను చేసుకుపోతున్నారు. భూమినంతటిని సముద్ర జలాలతో కప్పేసేందుకు సిద్ధమవుతున్నాడు.

గ్లోబల్ వార్మింగ్ లో సముద్రాలు తమ పాత్రను తాము పోషిస్తున్నాయి. ఉదాహరణకు వేడిగా - ఉప్పగా ఉండే ఉత్తర అట్లాంటిక్ సముద్ర జలాలు చల్లగా ఉండే హిందూ మహాసముద్రంలో కలుస్తున్నాయి. ఇది ఒక రకంగా ప్రకృతి వింతగా సైంటిస్టులు చెబుతున్నారు. దీనినే అట్లాంటిక్ మెరిడియొనర్ ఓవర్ టర్నింగ్ సర్కులేషన్ అని వ్యవహరిస్తారని ఇసబెలలే బ్రాస్ అనే రీసెర్చర్ కనుగొన్నాడు.

స్కాట్లాండ్ లోని గ్రీన్ లాండ్ నుంచి ఆఫ్రికా వరకు ఉన్న సముద్ర జలాలు ఒకదానిలో ఒకటి కలిసిపోతున్నాయని, ఇది ఒకరకంగా ఆందోళన కలిగించే విషయమని ఇసబెలలే అంటున్నారు. ప్రస్తుతానికి ‘ఈ కన్వేయర్ బెల్ట్’ లాంటి వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉన్నా భవిష్యత్ లో గ్లోబల్ వార్మింగ్ కు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మనిషి మనవాళికి నివాసయోగ్యమైన భూమిని కాపాడుకోవడంలో తన పాత్రను సక్రమంగా పోసిస్తే గ్లోబర్ వార్మింగ్ తగ్గించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సముద్రుడు కన్నెర్ర చేయక ముందే ప్రతిఒక్కరూ బాధ్యతగా గ్లోబర్ వార్మింగ్ పట్ల అవగాహన పెంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్ లో భూమిపై సముద్ర జలాలు - మంచు తప్ప మనిషి అనే జీవి ఉండకపోవచ్చు. సో ఇప్పటికైనా మనం మేల్కొందాం.. గ్లోబల్ వార్మింగ్ ను తరిమికొడుదాం..