Begin typing your search above and press return to search.

జపాన్​ లో సాగర కన్య అచ్చం అలాగే..!

By:  Tupaki Desk   |   7 March 2022 6:51 AM GMT
జపాన్​ లో సాగర కన్య అచ్చం అలాగే..!
X
సాహస వీరుడు.. సాగర కన్య అనే సినిమా ను మనం లో చాలా మంది చూసే ఉంటారు. అందులో వెంకటేష్ హీరోగా నటిస్తే.. శిల్పా శెట్టి , మాలాశ్రీ ఇద్దరు హీరోయిన్ గా కనిపించారు. అయితే ఈ సినిమాలో శిల్పా శెట్టి ఒక సాగర కన్యగా నటించింది. అప్పుడు ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దీనికి ముఖ్య కారణం సాగర కన్య. నడుము వరకు చేప రూపంలో ఉండి.. మిగతా శరీరం అంతా మానవ రూపంలో ఉంటుంది. ఆ రోజుల్లో చూసేందుకు ఇది చాలా వింతగా అనిపించింది.

ఎలా సాధ్యం అలాంటి జీవులు ఉంటాయా అని అందరూ అనుకున్నారు. సినిమా కదా అది కల్పితం అని చాలా మంది భావించారు. అయితే ఇదేమీ అబద్ధం కాదని అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఇది నిజం అని రుజువు చేయడానికి వారి దగ్గర కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకు రుజువుగా వారి దగ్గర ఉన్న సాగర కన్య ఆకారాన్ని పోలిన ఓ స్కెలిటన్ ను చూపిస్తున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు కూడా చేస్తున్నారు.

సాధారణంగా సాగర కన్య అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే దీని గురించి అప్పుడప్పుడు కొన్ని టీవీ ఛానెల్స్ లో చర్చలు నడిచేవి. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. అయితే నిజంగా ఇవి ఉన్నాయి అని ప్రూఫ్ మాత్రం ఎవరి దగ్గర లేదు. ఇంకా చెప్పాలి అంటే వాటిని ఎవరు కూడా ఇంత వరకు చూసి లేరు. కానీ జపనీయులు మాత్రం సాగర కన్య కాన్సెప్ట్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నారు.

ఇందుకు ప్రధాన కారణం వారికి ఇటీవల దొరికిన 300 ఏళ్ల నాటి సాగర కన్య అస్తిపంజరం. దీనిని జపాన్ శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఇలాంటివి చూడడం చాలా అరుదు. అయితే ఈ అస్తిపంజరం పై జపాన్ కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

ఇప్పుడు వారు పరిశోధనలు చేస్తున్న సాగర కన్య అస్తి పంజరం సుమారు 1736 నుంచి 1746 మధ్యకాలంలో ఉండేదని చెబుతున్నారు. జపాన్ లోని ఓ ద్వీవిలో దీనిని కనుగొన్నట్లు పేర్కొన్నారు. దీని పొడవు పొడవు సుమారు 12 అంగుళాల మేర ఉన్నట్లు గుర్తించారు. అది అచ్చం సాగర కన్యను పోలిన విధంగా ఉన్నట్లు తెలిపారు.

కింద భాగం అంతా చేపకు ఉన్నట్లు పొలుసులు ఉండగా... పై భాగం అంతా మనిషికి ఉన్నట్లుగా మానవ శరీరం ఉంది. అయితే ఈ వింత అస్తిపంజరం.. జననీయులకు పసిఫిక్ మహాసముద్రంలో దొరికినట్లు ఓ లేఖ చెప్తుంది. ఓ మత్స్యకారుడు చేపలు పట్టే క్రమంలో ఈ సాగర కన్య వలలో పడినట్లు అందులో ఉందని అంటున్నారు.

ఈ సాగర కన్యను అసకుచిలోని ఓ చేపలు పట్టి జీవించే వారి కుటుంబం రక్షించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొద్ది రోజులు తరువాత వారు ఓ దేవాలయంలో దానిని ఉంచినట్లు చెప్పారు. ఈ ఆలయానికి జపనీయుల ప్రకారం ఓ స్థల పురాణం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

దీనిపై మరింత విశ్లేషణ చేసేందుకు జపాన్ లోని కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ లోని ఓ విభాగం పనిచేస్తుంది. పూర్తి స్థాయిలో దీని పై అధ్యయనం చేసి మరిన్ని వివరాలను తెలియజేస్తామని అంటున్నారు అక్కడి పరిశోధకులు