Begin typing your search above and press return to search.
రోహిత్ శర్మకు గాయం.. తీవ్రమా?
By: Tupaki Desk | 14 Dec 2021 3:30 AM GMTటీమిండియా టి20, వన్డే సారథి రోహిత్ శర్మ గాయపడ్డాడు. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమవుతూ హిట్ మ్యాన్ గాయానికి గురయ్యాడు. వన్డే కెప్టెన్ గానూ ప్రమోషన్ పొందిన రోహిత్ కు ఇది అనుకోని ఘటన. టీమిండియాకూ కొంత దెబ్బే. ఎందుకంటే రోహిత్ టెస్టుల్లో ఓపెనింగ్ చేస్తూ అద్భుత ఆరంభాలనిస్తున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు వైస్ కెప్టెన్ గానూ పదోన్నతి సాధించాడు.
ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో రోహిత్ గాయానికి గురయ్యాడు. ముంబైలోని శరద్ పవార్ అకాడమీలో ఆదివారం రిషభ్ పంత్, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్న హిట్ మ్యాన్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు.
సఫారీ గడ్డపై సవాల్ విసిరే బౌన్సీ పిచ్‌లపై ఆడడం సవాల్. ఆ నేపథ్యంలో రోహిత్ మూడు రోజుల క్రితమే ప్రాక్టీస్ షురూ చేశాడు. టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర అలియాస్ రఘుతో ఎక్కువ బౌన్స్ అవుతున్న త్రో డౌన్స్ ప్రాక్టీస్ చేశాడు. అయితే, ఓ బంతి రోహిత్ చేతిని బలంగా తాకింది. రోహిత్ నొప్పితో విలవిల్లాడాడు.
గాయం తీవ్రత ఎంతదో తెలియాల్సి ఉంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌కు హిట్ మ్యాన్ దూరంగా ఉన్నాడు. వైస్ కెప్టెన్సీతో దక్షిణాఫ్రికా సిరీస్ కు అతడిపై భారీ అంచనాలున్నాయి.
ఆ క్రమంలోనే బ్యాటింగ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాడు. అయితే తాజా గాయం అటు భారత జట్టుతో పాటు అభిమానులను కలవరపెడుతోంది. గాయం పెద్దగా అయితే మాత్రం హిట్ మ్యాన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
2016లో ఇంగ్లండ్‌తో ముంబై టెస్ట్‌కు ముందు ఇదే రఘు త్రో డౌన్‌కు అజింక్యా రహానే వేలు విరిగింది. ఆ క్రమంలోనే టీమ్‌మేనేజ్‌మెంట్ రోహిత్ గాయంపై కలవరపడుతోంది.
మరోవైపు టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వేటుకు గురైన అజింక్యా రహానే నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. కెరీర్ పరంగా క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్న రహానేకు సౌతాఫ్రికా పర్యటన లిట్మస్ టెస్ట్‌లాంటింది.
జిమ్ సెషన్‌లో తొడకండరాలు పట్టేయడంతో రిషభ్ పంత్.. వార్మప్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇక శార్దూల్ ఠాకూర్.. కేఎల్ రాహుల్‌కు బౌలింగ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు.