Begin typing your search above and press return to search.
పోలవరంలో కేసీఆర్ మార్క్ షాకిస్తున్నాడుగా
By: Tupaki Desk | 1 Dec 2017 6:02 PM GMTఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ ఒకటి పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు పుల్ల వేయడం రెండోది...కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించడం. రెండో అంశం రాజకీయపరమైనది కాగా...మొదటి అంశం ఏపీలోని మెజార్టీ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించేది. కేంద్రం హఠాత్తుగా పోలవరం విషయంలో ఊహించని రీతిలో బ్రేక్‌లు వేయడం బాబు బ్యాచ్‌ను కలవరపాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుబట్టి రాష్ట్రం పరిధిలోకి ప్రాజెక్టును తీసుకొని చేసిన పనుల్లో జరిగిన అవకతవకలు, జాప్యం వంటివే ఈ బ్రేకులకు కారణమని జోరుగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. పోలవరం షాక్ నుంచి ఇప్పటికీ ఏపీ సర్కారు ఇంకా కోలుకోగా పోగా....బాబుకు మరింత బీపీ పెంచే పనిచేశారు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
పోలవరం వల్ల ఒడిశాతో పాటు తెలంగాణ, చత్తీస్ ఘడ్ లకు నష్టమని పేర్కొంటూ ఏకంగా ఒడిశా సీఎం వద్దకు తన రాష్ట్ర డిప్యూటీ సీఎంతో ఫిర్యాదు చేయించారు! తద్వారా బాబుకు తన మార్క్ షాకిచ్చారు. ఇప్పటికే ప్రధానమంత్రి సారథ్యంలోని కేంద్రం షాక్ ఇవ్వగా...దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ తన రీతిలో తోడయ్యారని అంటున్నారు. సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల ఇటు పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతుండటం, పనుల్లో లోటుపాట్లు, తాజాగా కేంద్రం ప్రాజెక్టుకు బ్రేకులు వేయడం అనే అంశానికి తోడుగా కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం ఉందని అంటున్నారు.
ఇంతకీ ఈ షాక్ పరంపరలో అసలేం జరిగిందంటే...భువనేశ్వర్లో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, మేయర్ బొంతు రామ్మోహన్ నేడు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను భువనేశ్వర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పోలవరం ప్రాజెక్టు గురించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మేయర్ బొంతు రామ్మోహన్ తో చర్చించి, పోలవరంపై ఒరిస్సా వైఖరిని వారికి తెలిపారు. దీనివల్ల ఒడిశాలో ముంపునకు గురవుతున్న గిరిజన గూడాలు, అటవీ భూముల గురించి చెప్పారు. పోలవరంపై ఒడిషా వైఖరిని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నవీన్ పట్నాయక్ ఉప ముఖ్యమంత్రి కడియం ను కోరారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒరిస్సాతో పాటు తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్న తమ వైఖరిని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనతో సమావేశమైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, మేయర్ బొంతు రామ్మోహన్ లకు వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం, మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ పోలవరం వల్ల తెలంగాణలో కూడా గిరిజన గూడాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తాము ఈ విషయాన్ని చర్చించగా...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి పోలవరం వల్ల కలిగే నష్టాలను తీసుకుపోవాలని తద్వారా ఉమ్మడిగా పోరాటం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం.
మొత్తంగా ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తీవ్రంగా ఇరకాటంలో పడ్డ ఏపీ సర్కారు తాజాగా పొరుగు రాష్ర్టాలైన ఒడిశా - తెలంగాణ చర్చల కారణంగా మరింత సంకట స్థితికి చేరుకుంటాయనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.