Begin typing your search above and press return to search.

మొబైల్ ఫోన్ పేలి యువ‌తి మృతి!

By:  Tupaki Desk   |   17 March 2018 10:22 AM GMT
మొబైల్ ఫోన్ పేలి యువ‌తి మృతి!
X
ఒడిశాలోని జర్సుగుడ జిల్లాలో మొబైల్ పేలిన ఘ‌ట‌న‌లో 18 ఏళ్ల యువతి దుర్మ‌ర‌ణం చెందింది. ఇంట్లో మొబైల్‌ కు చార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడుతుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఉమ‌ అనే యువ‌తి చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండ‌గా....హ‌ఠాత్తుగా బ్యాటరీ పేలిపోయింంది. ఈ ప్ర‌మాదంలో ఉమ‌ ఛాతికి - కాలుకు - చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శ‌బ్దం విన్న ఇరుగుపొరుగు వారు ఉమ‌ను హుటాహుటిన స‌మీప ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చేస‌రికే ఉమ‌ మృతి చెందిన‌ట్లు వైద్యు లు ధృవీక‌రించారు.

భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో ఉమ‌ మాట్లాడుతుండ‌గా చార్జింగ్‌ అయిపోయింద‌ని, అందుకే చార్జింగ్‌ పెట్టి మాట్లాడుతోండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఉమ‌ సోదరుడు ప్రసాద్‌ చెప్పాడు. ఆ ప్రమాద తీవ్ర‌త‌కు ఉమ స్పృహ తప్పిపడిపోయింద‌ని, వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లినా ఫ‌లితం లేద‌ని వాపోయాడు. గ‌త ఏడాది మార్కెట్లోకి కొత్త‌గా వ‌చ్చిన నోకియా 3110 క్లాసిక్ మోడల్ ఫోన్ ను ఉమ ఉప‌యోగిస్తోంద‌ని, ఈ ప్ర‌మాదానికి బాధ్య‌త వ‌హిస్తూ నోకియా తగిన పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు - స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా, చార్జింగ్ పెట్టిన స‌మ‌యంలో ఫోన్ మాట్లాడ‌డం సుర‌క్షితం కాద‌ని టెక్ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వినియోగ‌దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఆ స‌మ‌యంలో ఫోన్ వాడ‌కూడ‌ద‌ని చెబుతున్నారు.