Begin typing your search above and press return to search.

క్షమాపణ చెప్పలేదు కానీ.. క్యారికేచర్‌ తొలగించింది

By:  Tupaki Desk   |   1 July 2015 11:21 AM GMT
క్షమాపణ చెప్పలేదు కానీ.. క్యారికేచర్‌ తొలగించింది
X
ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కించపరుస్తూ కథనం ప్రచురించిన ఔట్‌లుక్‌ చర్యపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సీనియర్‌ జర్నలిస్టులు సైతం ఈ కథనాన్ని తప్పు పడుతూ సామాజిక వెబ్‌సైట్లలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇక.. ఇదే అంశంపై ఇంగ్లిషు మీడియా ఛానళ్లు.. ప్రత్యేక కథనాలు సైతం ప్రచారం చేయటం మొదలైంది. ఇక.. ఆన్‌లైన్‌లో ఈ నిరసనల వార్‌ మరింత పెద్దదైంది. సీనియర్‌ అధికారులతో పాటు.. జర్నలిస్టులు.. మిగిలిన మహిళా సంఘాల వారు కథనాన్ని తప్పు పడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఔట్‌టుక్‌ భేషరతు క్షమాపణ చెప్పాలని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. ఈ కథనంపై క్షమాపణలకు సంబంధించి ఔట్‌లుక్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ.. కథనంలో వినియోగించిన క్యారికేచర్‌ని మాత్రం పత్రిక ఉప సంహరించుకుంది. క్యారికేచర్‌ని ఉపసంహరించుకోవటం అంటే.. తాను తప్పు చేసిన విషయాన్ని ప్రాధమికంగా ఒప్పుకున్నట్లేనా?