Begin typing your search above and press return to search.

ఏపీ ఖజనా ఖల్లాస్.. అధికారుల బెంబేలు

By:  Tupaki Desk   |   30 Jan 2019 7:04 AM GMT
ఏపీ ఖజనా ఖల్లాస్.. అధికారుల బెంబేలు
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడంతో ఏపీ కొంత లోటు బడ్జెట్ తో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన విషయం అందరికీ తెల్సింది. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నాలుగున్నరేళ్లు కావస్తున్నా రాష్ట్ర పరిస్థితి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఏపీని పాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నాలుగేళ్లలో ఏపీ పరిస్థితిని చక్కదిద్దకపోగా లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీ ప్రజలపై మరింత భారం మోపారు.

ఏపీ లోటు బడ్జెట్ తో విడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయాల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. వీటికితోడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీని మరో సింగపూర్ ను చేస్తానంటూ దొరికన కడల్లా అప్పులు చేసి అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా దుబారా చేశారు. రాజధాని అమరావతి పేరిట ఏపీ ప్రజలకు బహుబలి లాంటి గ్రాఫిక్స్ చూపించారు. ఈ నాలుగున్నర ఏళ్లలో కేంద్రం చేసిన సాయం, చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు ఏం చేశారో తెలియని పరిస్థితి.

ఏపీని చంద్రబాబునాయుడు సరైన ప్రణాళికతో అభివృద్ధి చేసింటే ఈ నాలుగేళ్లర ఏళ్లలో ఏపీ పరిస్థితి మరోలా ఉండేది. ఏపీకి దేశంలో దేశంలోనే అతిపెద్ద కోస్టల్ ఏరియా ఉంది. దేశంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లు అతిపెద్ద కోస్టల్ ఏరియా కలిగిన ప్రాంతాలు. దీనిని బాబు సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలం చెందాడని పలువురు విమర్శిస్తున్నారు. ఏపీలో మైనింగ్, భారీ పరిశ్రమలు, వ్యవసాయ, వ్యవసాయేతర, ప్రజలు కట్టే పన్నులను సక్రమంగా వినియోగించడంలో బాబు విఫలం చెందడంతో ఏపీ ఇప్పడు దివాళా దిశగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే ఏపీ ఖజనా నిండుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిల్లలు చెల్లింపులను నిలిపివేసినట్లు సమాచారం. దీనికితోడు ఎన్నికలు సమీపిస్తుండటందో చంద్రబాబు నాయుడు ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. దీంతో ఏపీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల తర్వాత సంగతెమోగానీ ప్రస్తుతం ఈ రెండు నెలలు ఎలా వెళ్లదీయాలని ఆలోచిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఉద్యోగుల జీతాలు చెల్లించాక మిగిలిన సొమ్ముతో బిల్లులు చెల్లించాలని చూస్తున్నారు.

ఈ నాలుగేళ్లర ఏళ్లలో ఏపీ పరపతి పూర్తిగా దిగజారిపోయింది. ఏపీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు ఫిబ్రవరిలో 30వేల కోట్ల అప్పులు తేవాలని భావిస్తున్నారు. అయితే ఏపీ పరపతిని చూసి అంతసాయం చేసేందుకు ఏ ఆర్థిక సంస్థలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఉత్పాదక రంగంపై దృష్టిసారించకుండా ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం వాడబోతుండటంతో అప్పు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

ఏపీ పరిస్థితి అధాన్నంగా మారితే బాబు మాత్రం ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా తాయిలాలను ప్రకటిస్తున్నారు. వీటికితోడు రైతు రుణమాఫీ కోసం 8వేల కోట్లు, పెంచిన పింఛన్ల చెల్లింపులకు రూ.1,800కోట్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపుకు 2.5వేల కోట్లు ఇప్పటికప్పుడు చెల్లించాల్సిన పరిస్థితి. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద అప్పుగా మూడు విడుతల్లో మూడు వేలు ఇవ్వాలని యోచిస్తున్నారు. వీటన్నింటికి భారీగా సొమ్ము కావాలి. ఈ రెండు నెలలు ఎలా గడుస్తాయని తలలు పట్టుకుంటున్న అధికారులకు చంద్రబాబు తీరుతో ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా మారింది. దినదిన గండంలా మారిన ఏపీ ఆర్థిక వ్యవస్థను ఎవరు చక్కదిద్దుతారో చూడాలి మరీ.