Begin typing your search above and press return to search.
అరెరే.. కొడాలి నానిని అడ్డంగా బుక్ చేసిన ధూళిపాళ్ల
By: Tupaki Desk | 23 Jan 2022 4:32 AM GMTతప్పు జరిగితే మౌనంగా ఉండటానికి మించిన పని ఉండదు. దూకుడు రాజకీయాల్లో ఇందుకు రివర్సుగా వ్యవహరిస్తూ.. తొండి వాదనతో విషయాల్ని పక్కదారి పట్టించే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. అయితే.. ఆ వ్యూహం అన్నిసార్లు వర్కుట్ కావటం తర్వాత.. అడ్డంగా బుక్ కావటం ఖాయం.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ మంత్రివర్యులు కొడాలి నాని. సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడ పట్టణంలో తనకు చెందిన కన్వెన్షన్ సెంటర్లో భారీగా కేసినోను నిర్వహించటం.. దీనికి సంబంధించిన వీడియోలు అప్పుడే బయటకు రావటం.. వాట్సాప్ గ్రూపుల్లో హడావుడి జరగటం తెలిసిందే.
పండుగ తర్వాత ఈ కేసినో ఎపిసోడ్ ను తెర మీదకు తీసుకొచ్చిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈ ఇష్యూలో కొడాలి నానిని అడ్డంగా బుక్ చేసింది.
అయినప్పటికీ.. పెడసరంగా మాట్లాడటం.. ఒక మాటకు పది ఘాటు మాటలతో జవాబు ఇవ్వటం ద్వారా.. విషయాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడను ప్రదర్శించారు కొడాలి నాని.
కానీ.. ఆయన ఎత్తుగడ ఫలించలేదు. ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడ్ని అడ్డదిడ్డంగా తిట్టినప్పటికి తెలుగు తమ్ముళ్లు ఆ విషయం జోలికి వెళ్లకుండా.. కేసినో ఇష్యూ మీదనే నిలబడటమే కాదు.
అనవసరమైన ఆవేశంతో చేసిన 2 లీటర్ల పెట్రోల్ సవాలును గుర్తు చేసేలా వ్యవహరించటం గమనార్హం.
తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర.. కేసినోకు సంబంధించి తాము చేస్తున్నవన్నీ ఉత్త ఆరోపణలు కావని.. అన్నింటికి ఆధారాలు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేసేలా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో కేసినో నిర్వహించారన్న దానికి తగ్గట్లే.. ఒక యాప్ ను.. వెబ్ సైట్ తో పాటు.. వాటికి సంబంధించిన ఆధారాల్ని ప్రదర్శించారు.
అందులో.. ఇప్పటికే బయటకు వచ్చిన సీన్లకు అదనంగా మరికొన్ని బయటకు రావటమే కాదు.. అందులో క్యాసినో ఎంత భారీగా నిర్వహించారన్న విషయంతో పాటు.. స్టేజ్ మీద పాటలు పాడే వారి మీద డబ్బుల్ని వెదజల్లిన దృశ్యాలు కూడా బయటకు వచ్చి కలకలం రేపుతున్నారు.
ఇదంతా చూస్తే.. కెలికి మరీ రచ్చ చేయించుకున్నట్లుందని చెప్పాలి. మరి..
ధూళిపాళ్ల వారి వీడియోకు కొడాలి నాని ఏం చెబుతారో? ఎలా సమాధానం ఇస్తారో? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పటిలానే చంద్రబాబును.. ఆయన కుమారుడు లోకేశ్ ను కానీ టార్గెట్ చేస్తే.. కొడాలి మరింత పలుచన కావటం ఖాయం.