Begin typing your search above and press return to search.
క్యాబ్ డ్రైవర్ ను రెండు సార్లు రేప్ చేసింది!
By: Tupaki Desk | 13 April 2017 5:10 AM GMTఅప్పుడెప్పుడో వచ్చిన జంబలకిడిపంబ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో అంతా రివర్స్ గా జరుగుతూ ఆకట్టుకునే హస్యం ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేలా చేసింది. సదరు హాస్యం నిజమనే ఘటన అగ్రరాజ్యమైన అమెరికాలోని ఓహియోలో జరిగింది. ఓ యువకుడిపై రసికసికామణి అయిన ఓ అమ్మడు అత్యాచారం చేసింది. ఒకటి కాదు రెండు సార్లు! అది కూడా క్యాబ్ డ్రైవర్ గా తన డ్యూటీ చేస్తున్న సమయంలోనే సదరు వ్యక్తిని చెరిసింది. క్యాబ్ డ్రైవర్ ను బెదిరించి వరుసగా రెండు సార్లు అత్యాచారానికి పాల్పడి అందరూ ముక్కున వేలేసుకునేలా ఈ అమ్మడు అఘాయిత్యానికి పాల్పడింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే ఈ ఏడాది జనవరి 28న ఓహియోకు చెందిన బ్రిట్జనీ కార్టర్(23) అనే యువతి తన మిత్రుడు కోరీ జాక్సన్ తో కలిసి ట్రినిటీ ఎక్స్‌ప్రెస్ అనే క్యాబ్ సర్వీస్ లో ప్రయాణించింది. అయితే టాక్సీ సిటీ ఆఫ్ ఫిండ్లేకు చేరుకోగానే డ్రైవర్ పై ఇద్దరు కలిసి దాడికి దిగారు. కార్టర్ స్నేహితుడు డ్రైవర్ గొంతుపై కత్తిపెట్టి బెదిరించగా ఆమె అత్యాచారానికి ఒడిగట్టింది. అనంతరం డ్రైవర్ వద్ద ఉన్న 32 డాలర్లు( సుమారు రూ. 2000)లను దోచుకున్నారు. అంతటితో ఆగకుండా కార్టర్ మరోసారి అతడిపై అత్యాచారం చేసి అక్కడి నుంచి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పరారయింది. చచ్చీ చెడీ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కార్టర్ ను మార్చి 10న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె హన్కాక్ కంట్రీ జైలులో శిక్ష అనుభవిస్తోంది. కాగా, ఇంతకుముందు కూడా కార్టర్ పై మర్డర్ కేసుతో పాటు డ్రగ్స్ కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/